బలమైన ముంబై బ్యాటింగ్ లైనప్: ఆ బౌలర్ ను నమ్ముకున్న శ్రేయాస్

IPL 2025 Qualifier 2: ఐపీఎల్ 2025.. క్వాలిఫయర్ 2 ఉత్కంఠభరితంగా మారింది. టైటిల్ హాట్ ఫేవరెట్ గా ఉంటూ వచ్చిన గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ దశలోనే తిరుగుముఖం పట్టడంతో సమీకరణాలు, అంచాలన్నీ తారుమారు అయ్యాయి. ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్ 2 అడుగుపెట్టడం.. ఈ సిరీస్ ను మరింత రసవత్తరంగా మార్చింది.

ఈ సాయంత్రం క్వాలిఫయర్ 2 గేమ్ జరుగనుంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ బిగ్ గేమ్ కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఢీ కొట్టబోతోంది ముంబై ఇండియన్స్. ఇందులో గెలిచిన జట్టు మంగళవారం జరిగే ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లల్లో ఏ జట్టు ఫైనల్స్ కు చేరుతుందనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

Yuzvendra Chahal likely to play IPL 2025 Qualifier 2 against Mumbai Indians

ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉందో.. ఈ పాటికి పంజాబ్ కింగ్స్ కు తెలిసివచ్చే ఉంటుంది. గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ఏకంగా 228 పరుగుల స్కోర్ నిలబెట్టిందంటే- ఆ జట్టు బ్యాటింగ్ పవర్ ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఫైనల్స్ చేరాలంటే ఈ మ్యాచ్ కూడా ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది ముంబై ఇండియన్స్ కు. ఫలితంగా- ఇక్కడ కూడా అదే రేంజ్ లో చెలరేగిపోయే అవకాశాలు లేకపోలేదు. రోహిత్ శర్మ, జానీ బెయిర్ స్టో, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్.. ఇలా లోయర్ ఆర్డర్ వరకూ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది ముంబైకి.

అలాంటి జట్టును కట్టడి చేయాలంటే పంజాబ్ కింగ్స్ బౌలర్లు తమ స్థాయికి మించిన ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అంచనాలకు తగ్గట్టుగా వాళ్లు రాణించలేకపోయారు. రెండు వికెట్లను మాత్రమే పడగొట్టగలిగారు.

ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్, అర్ష్ దీప్ సింగ్, కైలె జెమిసన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ ప్రీత్ బ్రార్.. ముంబై బ్యాటర్ల దూకుడుకు సకాలంలో అడ్డుకట్ట వేయలేకపోతే ఫైనల్స్ పై ఆశలు వదులుకోక తప్పకపోవచ్చు.

ఈ బౌలింగ్ లైనప్ కు తోడు.. యుజ్వేంద్ర చాహల్ తుదిజట్టులో ఆడే అవకాశాలు ఉన్నాయి. గాయం కారణంగా కిందటి నెల 18వ తేదీ నుంచి జట్టుకు అందుబాటులో ఉండట్లేదీ స్పిన్ బౌలర్. ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ సాధించాడని మేనేజ్ మెంట్ చెబుతోంది. పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11లో చాహల్ చేరితే.. బౌలింగ్ మరింత పదునెక్కడం ఖాయం.

చివరిసారిగా మే 18వ తేదీన మ్యాచ్ ఆడాడు చాహల్. కుడి మణికట్టుకు గాయం కావడంతో తప్పుకోవాల్సి వచ్చింది. ఫిట్ నెస్ ట్రైనింగ్ సెషన్‌లో ఎనర్జిటిక్ గా కనిపించాడు. ఫుట్‌బాల్ ఆడాడు, క్యాచ్‌లు పట్టాడు, బంతులను థ్రో చేయగలిగాడు. నెట్‌లో రెండు ఓవర్లు బౌలింగ్ సైతం చేయగలిగాడు. దీనితో తుదిజట్టులో అతన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ముంబైపై క్వాలిఫయర్ 2 ఆడే పంజాబ్ కింగ్స్ తుదిజట్టులో- ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌ సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కేప్టెన్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్/ యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, కైల్ జెమిసన్ ఆడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+