క్రికెటర్ భార్యతో డ్యాన్స్ మాస్టర్ రొమాన్స్
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 2016లో భారత దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టి తక్కువ వన్డేల్లో వంద వికెట్లను తీసిన ఐదో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.142 ఇన్నింగ్స్‌ల్లో 187 వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు. ఇదే సమయంలో గ్రౌండ్‌లో సైతం అందర్ని ఆటపట్టిస్తూ చాలా సరదాగా కనిపిస్తుంటాడు.
ప్రధాని మోదీ సైతం యుజ్వేంద్ర చాహల్ గురించి మాట్లాడుతుంటారు. ఇక యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ధనశ్రీ వర్మ, భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్యగా మాత్రమే కాకుండా, ఒక ప్రతిభావంతురైన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఆమె తన ప్రత్యేకమైన డ్యాన్స్ వీడియోల ద్వారా ప్రేక్షకులను ఆకర్షించారు.

ధనశ్రీ చిన్నప్పటి నుండి భరతనాట్యం నేర్చుకున్నారు. ఆమె తన స్వంత డ్యాన్స్ కంపెనీని కూడా స్థాపించారు. ధనశ్రీ ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె తన డ్యాన్స్ వీడియోలు, ఫ్యాషన్ ట్రెండ్‌లు ,జీవితం గురించి వీడియోలు పంచుకుంటారు. ఇదిలా ఉంటే ధనశ్రీ త్వరలో తెలుగు సినిమాలో అడుగుపెట్టబోతున్నారు.ధనశ్రీ ప్రస్తుతం 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కొరియోగ్రాఫర్ యశ్ హీరోగా నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్ తో పాటు ఓ పాటను కూడా విడుదల చేసింది చిత్రయూనిట్. హర్షిత్ రెడ్డి, హన్సితా రెడ్డి సంయుక్తంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. 'ఆకాశం దాటి వస్తావా' సినియా విషయానికి వస్తే... డ్యాన్స్‌కు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతోనే ధనశ్రీ ఓకే చెప్పారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications