చంద్రబాబే సిఎం అవుతారా?

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం నాయకత్వంలోని మహాకూటమిలో సిద్ధాంతులే కానీ సిద్ధాంతాలు లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. టీఆర్ ఎస్ అధినేత చంద్రశేఖరరావు ప్రగాఢంగా నమ్మే సంఖ్యాశాస్త్రవేత్త రమణరావు టిడిపి టీఆర్ ఎస్ ల మధ్య పొత్తు కుదరడంలో కీలకపాత్ర వహించారు.

కానీ నాలుగేళ్ళ క్రితమే చంద్రబాబు నాయుడి జాతక చక్రాన్ని విశ్లేషించిన ప్రముఖ జ్యోతిష పండితులు నూకల సూర్యనారాయణ 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడూ వ్యూహాలు మార్చుకుని బొటాబొటి మెజారిటీతో ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన జోస్యాన్ని దట్స్ తెలుగు డాట్ కాం ప్రచురించింది. ఆ యూఅర్ ఎల్ ను ఇక్కడ్ క్లిక్ చేసి చూసుకోవచ్చు చంద్రబాబు జాతకం

సిద్ధాంతుల, సిద్ధాంతాల ప్రస్తావన వచ్చింది కాబట్టి దట్స్ తెలుగు ఆర్కీవ్స్ లోకి వెళ్ళి ఈ ఆర్టికల్ ను తీసుకురావడం సముచితం అనిపించింది. సిద్ధాంతుల, సిద్ధాంతాల ప్రస్తావన వచ్చింది కాబట్టి దట్స్ తెలుగు ఆర్కీవ్స్ లోకి వెళ్ళి ఈ ఆర్టికల్ ను తీసుకురావడం సముచితం అనిపించింది. 2005 మే 11 న ఈ ఆర్టికల్ దట్స్ తెలుగులో టాక్ ఆఫ్ టుడే శీర్షిక కింద ప్రచురితమైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి వామపక్షాలతో, టీఅర్ ఎస్ తో ప్రభుత్వం ఏర్పాటు చేసి అప్పటికి దాదాపు ఏడాది అవుతోంది. తిరుగులేని మెజారిటీతో, రాజసంతో రాజశేఖరరెడ్డి కొలువుదీరిన సమయంలో నూకల సూర్యనారాయణ గారు ఈ జోస్యం చెప్పడం ఒక రకంగా సాహసమే.

ఆర్కీవ్స్ ను పరిశీలించి ఆయనను నేడు సంప్రదించగా తాను ఇప్పటికీ ఆ జోస్యానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. వేదిక్ ఆస్ట్రాలజీలో నిష్ణాతులైన ఆయన గ్రహాల ప్రభావం వ్యక్తుల జాతకాల మీద ఎలా ఉంటుందో విశ్లేషించారు. ఏ రాజకీయ నాయకుడి మీద తనకు రాగ ద్వేషాలు లేవని, శాస్త్ర ఏం చెబుతుందో తాను నాలుగేళ్ళ క్రితం వివరించి చెప్పానని, ఈసారి చంద్రబాబు నాయుడి నాయకత్వం లోని మహా కూటమి బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని చెప్పారు.

నూకల గారు బిగ్ ఎఫ్ ఎం రేడియోలో దినఫలాలు చెప్పడం ద్వారా గత మూడేళ్ళుగా శ్రోతలకు సుపరిచితులు. ఇప్పుడు ఆయన టీవీ 5 లో కూడా తెల్లవారుజామున రోజూ దినఫలాలు, గ్రహగతుల గురించి వివరిస్తున్నారు.

మంచి కాలం కోసం ఎదురుచూసే వారు ఆయనను సంప్రదించవచ్చు. ఆయన మెయిల్ ఐడి [email protected] ఫోన్ నెంబర్: 9949579697

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+