హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి సిఎం అవుతారా?

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: చిరంజీవి నిజామాబాద్ పర్యటన విజయవంతం కావడంతో ఆ పార్టీ వర్గాల్లో హర్షం కనిపిస్తోంది. చిరంజీవి విశ్రాంతి మానుకుని ఎన్టీఆర్ లాగా మొండిగా జనంలో తిరిగితే ఆయనే డార్క్ హార్స్ లా విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని ఒక రాజకీయ విశ్లేషణ కర్త చెప్పారు. తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతి, అక్రమాలతో విసిగిపోయిన జనం అవినీతి బురద అంటని కొత్త రాజకీయాలను కోరుకోవడంలో ఆశ్చర్యం లేదని, అయితే చిరంజీవి మృధువుగా మాట్లాడకుండా కాంగ్రెస్, తెలుగుదేశం, టీఅర్ ఎస్ పార్టీల మీద విరుచుకుపడాలని పేరు ప్రచురించవద్దన్న షరతు మీద ఆ పెద్దాయన చెప్పారు.

తెలుగుదేశం మహా కూటమి పైకి పెద్దగా కన్పించినా లోపల ఉన్నది అంత పటిష్టమైనది కాదని ఒక విశ్లేషణ. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ఈసారి ఎవరి మద్దతు లేకపోయినా సొంతంగా అధికారంలోకి రాగలమన్న ఆత్మవిశ్వాసంతో ఉంది. బిజెపి జాడ ఎక్కడా కన్పించడం లేదు. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీకి డిపాజిట్లు దక్కవని, మేడ్చల్ నుంచి ఆయన గెలిచేది కష్టమని ఒక దినపత్రిక సర్వేలో వెల్లడైంది.

చిరంజీవి వామపక్షాలతో, లోక్ సత్తాతో పొత్తు పెట్టుకుని ఉంటే బాగుండేది. వచ్చే ఎన్నికల విషయంలో వైఎస్ ఎంత అతి విశ్వాసంలో ఉన్నారో చిరంజీవిలో కూడా అదే కనిపిస్తోంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి ఒక కుటుంబం ఇష్టారాజ్యం అనే ముద్ర పడడం వ్యతిరేకాంశం. చిరంజీవికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్ధానాలు వస్తాయని ఒక అంచనా. అక్కడ పరిస్ధితులు ఎలా ఉన్నా చిరంజీవికి రాయలసీమ జిల్లాల్లోను, ప్రకాశం, గుంటూరు జిల్లాలోను గణనీయంగా ఓట్లు వచ్చే అవకాశముందని ప్రాధమిక సర్వేలలో వెల్లడవుతోంది.

హంగ్ అసెంబ్లీ రావడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేదు. అటో ఇటో తేల్చేయడం మన తెలుగువారి లక్షణం. కానీ ఈసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కాంగ్రెస్ కు 100 నుంచి 110 స్ధానాలు, మహాకూటమికి 90 నుంచి వంద స్ధానాలు వస్తాయని, ఇండిపెండెంట్లు, రెబల్స్ 20 స్ధానాల వరకు గెలుచుకోవచ్చని, చిరంజీవి పార్టీకి 70 స్ధానాలు వస్తే రాజీ ఫార్ములాలో భాగంగా చిరంజీవి రెండున్నర ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి అవుతారని ఒక అంచనా. చిరంజీవికి రెండున్నరేళ్ళు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీయే కాకుండా మహా కూటమి కూడా అఫర్ చేసే అవకాశాలున్నాయి. ఆ ఆశతోనే చిరంజీవి "ఆ దేవుడు అనుగ్రహిస్తే ముఖ్యమంత్రిని అవుతా" అన్న ప్రకటన చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X