ఎన్టీఆర్ ప్రభావం ఎంత?

Jr Ntr
హైదరాబాద్: రేపటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షోలు ప్రారంభం కానున్నాయి. తాతగారు ఎన్టీఆర్ రూపాన్ని, ఆవేశాన్ని పుణికి పుచ్చుకున్న జూనియర్ ఉత్తరాంధ్రలో దుమ్మురేపబోతున్నారు. ఆయన ఆవేశపూరిత ప్రసంగాలకు జనం బాగా స్పందిస్తారని తెలుగుదేశం నాయకులు గంపెడు ఆశతో ఉన్నారు. ఎన్టీఆర్ తరహాలోనే ఆయన డైలాగ్ డెలివరీ ఉంటుంది. తాను పుట్టకముందు ఎన్టీఆర్ 1982 లో చేసిన ప్రసంగాల కేసెట్లను చాలా కాలంగా వింటున్న జూనియర్ తన ప్రసంగాల్లో కంటెంట్ ఏముండాలో ఎక్సర్ సైజ్ ను పూర్తి చేసుకున్నారు.

ఆనాడు తాతగారు వాడిన చైతన్యరథం తరహాలోనే జూనియర్ ప్రచార రథం సిద్ధమైంది. ఆనాడు ఎన్టీఆర్ వేసుకున్న ఖాకీ దుస్తులనే జూనియర్ రోడ్ షోలలో ధరించనున్నాడు. కాంగ్రెస్ అవినీతి మీద జూనియర్ పదునైన డైలాగ్స్ సంధించనున్నారు. సామాన్యుడికి కూడు, గుడ్డ, నీడ ఇవ్వాలన్న లక్ష్యంతోనే తాతగారు తెలుగుదేశం పార్టీ స్ధాపించారని. అధికార వ్యామోహంతో కాదని అతను చెప్పదలచుకున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి ప్రజాసేవ కోసం కాకుండా కేవలం పదవీ వ్యామోహంతోనే రాజకీయాల్లోకి వచ్చారన్న సందేశాన్ని పరోక్షంగా ఆయన జనానికి అందించనున్నారు.

తెలుగుదేశం పార్టీ తరఫున రోడ్ షోలు నిర్వహించడానికి మొదట అంగీకరించని జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు నాయుడు ఎలా దారికి తెచ్చుకుని ఉంటారు? ప్రలోభపెట్టడంలో చంద్రబాబు నాయుడికి మించిన వారు లేరని ఆయన ప్రత్యర్ధులు అంటూ ఉంటారు. మరి జూనియర్ ఏ ప్రలోభానికి లొంగినట్టు? కాంగ్రెస్ లో ఉన్న హీరో కృష్ణకు పద్మాలయ భూములకు వైఎస్ ప్రభుత్వం తాయిలాలు ఇచ్చి 150 కోట్ల మేరకు లాభం చేకూర్చిందన్న విమర్శలు అందరికీ తెలిసినవే.

చంద్రబాబు నాయుడు ఒకవేళ అధికారంలోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక తాయిలాలు ఇవ్వనున్నారా? లేదా తమ కుటుంబంలోనే వరుసైన సంపన్న అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేసి, కుటుంబంలో ప్రధాన పాత్ర ఉండేలా చేస్తారా? తన తల్లి శాలిని కులం వేరు కావడం వల్ల తనను ఎన్టీఆర్ కుటుంబంలోకి చేరనివ్వడం లేదని, తనను చులకనగా చూస్తున్నారని జూనియర్ కు బాధ, ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేవి. వాటిని పారదోలే మంత్రాన్ని చంద్రబాబు ప్రయోగించి ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు.

ఏమైతేనేం ఎన్టీఆర్ కు నిజమైన వారసుడి వంటి జూనియర్ రథం సిద్ధం చేసుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు. జూనియర్ రోడ్ షోలను అధికార కాంగ్రెస్ పార్టీ తక్కువగా అంచనా వేయడం లేదు. జూనియర్ పర్యటనలో ప్రజల ప్రతిస్పందనలపై నివేదికలు పంపవలసిందిగా వేగుల వాళ్ళ (ఇంటిలిజెన్స్)కు ఆదేశాలు వెళ్ళినట్టు తెలుస్తోంది. రేపటి నుంచి టీవీ చానళ్ళ వారికి అదనపు ధమాకా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+