వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొమ్మ కోసం చిరు, కిరణ్ ఫైట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi and Kiran Kumar Reddy
రాష్ట్రంలో 108 సేవల నిర్వహణకు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన వార్తలు నిజమయ్యాయి. ఆ విషయాన్ని చిరంజీవి సోమవారం స్వయంగా ధ్రువీకరించారు. తమకు 108 సర్వీసులను ఇస్తే నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని, ఆర్థిక భారం పడినా నిర్వహించగలనని ఆయన అన్నారు. తమకు ఇస్తే సంతోషమని, ప్రభుత్వం ఇస్తుందో లేదో తెలియదని ఆయన అన్నారు. ఇస్తుందో, లేదో అనే అనుమానం చిరంజీవికి రావడానికి ప్రధాన కారణం - ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రహస్య పోరాటం సాగుతుండడమే.

గత ఎన్నికల్లో ఆరోగ్యశ్రీ, 108 సేవలు కాంగ్రెసు పార్టీకి కలిసి వచ్చాయి. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో 108 సేవలను చిరంజీవికి ఇచ్చే విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి ఓ షరతు పెడుతున్నట్లు తెలుస్తోంది. 108 సేవల వాహనాలపై ఎవరి చిత్రం ఉండాలనే అంశంపైనే చిరంజీవికి, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య పోరు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెసు నుంచి ముందుకు రావాలని, ఎన్నికల విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని చిరంజీవి కోరుకుంటున్నారు. అందుకే 108 సేవల వాహనంపై తన చిత్రాన్ని ముద్రించుకోవడం ద్వారా విశేష ప్రచారం లభిస్తుందని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ సేవలను తాను సొంతం చేసుకోవడానికి చిరంజీవి ప్రయత్నించడంలో ప్రధాన లక్ష్యం అదేనని చెబుతున్నారు. అయితే, తన ఫొటో ఉండాలని కిరణ్ కుమార్ రెడ్డి పట్టుబడుతున్నారట. ఈ విషయంలోనే ఇరువురి మధ్య సయోధ్య కుదరడం లేదని సమాచారం.

English summary
It is said that there was a silent fight between CM Kirankumar Reddy and Chirnnjeevi on 108 services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X