నిత్యానందకు అమావాస్య కష్టాలు

సిఐడి చెప్పినట్లు పేర్కొంటూ మీడియా తనపై వార్తాకథనాలను రాస్తోందని, తాను 15 మందితో లైంగిక కార్యకలాపాలు నెరిపినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ఇస్తున్నాయని, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అదుపులోని సెక్స్ కోరికలతో నిత్యానంద రెచ్చిపోతాడని మరికొన్ని మీడియా సంస్థలు వార్తలు ఇచ్చాయని, సిఐడి విచారణలో తాను చెప్పినట్లుగానే ఈ వార్తలన్నీ వచ్చాయని ఆయన చెప్పుకున్నారు.
అటువంటి వాంగ్మూలాలు తాను ఎక్కడా ఇవ్వలేదని స్వామి నిత్యానంద చెప్పారు. తన శిష్యులతో సెక్స్ కార్యకలాపాలు నెరిపినట్లుగా కూడా తాను అంగీకరించలేదని ఆయన అన్నారు. ఈ విషయంలో మార్చి 31వ తేదీ లోగా అభ్యంతరాలను తెలియజేయాలని మెజిస్ట్రేట్ సిఐడికి నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications