చిరు, వర్మ మధ్య గొడవల వెనక?

వర్మకు ఒకప్పుడు గడ్డం చక్రవర్తి అనే జెడి చక్రవర్తి వర్మకు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. నిజానికి, చక్రవర్తి సినీ జీవితం వర్మతో ముడిపడి ఉన్నట్లుగా అనిపించేది. ఆ సాన్నిహిత్యాన్ని ఆసరాగా తీసుకుని జెడి చక్రవర్తి చిరంజీవికి వర్మపై ఉన్నవీ లేనివీ చెప్పేశారట. చిరంజీవిపై వర్మ సైటైర్లు విసిరాడంటూ కొన్ని ఉదాహరణలను కూడా ఆయన చేరవేశారని చెబుతారు. దీంతో వర్మపై చిరంజీవి మండిపడడం ప్రారంభించారని అంటారు. దీంతో వర్మకు, చిరంజీవికి మధ్య తేడాలు వచ్చాయని సమాచారం.
అయితే, ఆ తర్వాత చిరంజీవికి అసలు విషయం తెలిసిందట. చక్రవర్తి ఇరువురి మధ్య గొడవలు పెట్టి తన సినిమాకు దర్శకత్వం వహించాలని ఆశపడ్డాడని, అందులో భాగంగానే వర్మతో విభేదాలు సృష్టించాడని చిరంజీవికి తెలిసి వచ్చిందని అంటారు. దీంతో చక్రవర్తి అటు వర్మకూ ఇటు చిరంజీవికీ - ఎవరికీ కాకుండా పోయాడని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications