తమ్ముళ్లకు పనికి రాని చంద్రబాబు

చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం లాగానే రెండు జెండాలు తయారవుతున్నాయి. తెలుగుదేశం తెలంగాణ నేతలు తమ జెండాను మార్చుకున్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఫొటో లేకుండా తెలంగాణ నాయకులు తమ జెండాను రూపొందించుకున్నారు. తెలంగాణ చిత్రపటంతో ఉన్న పసుపు జెండాలో చిన్నగా టిడిపి గుర్తుకు స్థానం కల్పించారు. చంద్రబాబు ఫొటో ఉండదు. ఇక చంద్రబాబు ఫొటో ఉన్న పాత జెండా సీమాంధ్రకు మాత్రమే పరిమితం కానుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చితికిపోయిన స్థితిలో దాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా తెలంగాణ తమ్ముళ్లు జెండాను కూడా మార్చేశారు.
తెలంగాణలో చంద్రబాబుకు విశ్వసనీయత లేకుండా పోయిందని, చంద్రబాబుతో పోలిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికే విశ్వసనీయత ఎక్కువగా ఉందని పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి మాటలు తెలంగాణ తమ్ముళ్లకు బస్సుయాత్ర ద్వారా అనుభవంలోకి వచ్చినట్లే ఉంది.












Click it and Unblock the Notifications