చంద్రబాబుకు బాలకృష్ణ ఎసరు?

పార్టీలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తూ నారా లోకేష్ రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకోవడానికి నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నాలకు విరుగుడుగా బాలకృష్ణను చంద్రబాబు ముందు పెడుతున్నారంటూ బలమైన అభిప్రాయం ముందుకు వచ్చింది. కానీ, రాష్ట్రంలో తెలుగుదేశం నాయకత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని బాలకృష్ణపై ఒత్తిడి పెరుగుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లవచ్చునని కూడా చెబుతున్నారు. ఇందుకు అవసరమైన ప్రాతిపదిక తయారవుతున్నట్లు చెబుతున్నారు.
ఒక సామాజిక వర్గానికి చెందిన ఎన్నారైలు బాలకృష్ణ పూర్తి స్థాయిలో పార్టీని చేతుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారట. అందుకు అనుగుణంగా బాలకృష్ణతో ఎమ్మెల్యే పేరుతో ఓ సినిమా తీయడానికి కూడా వారు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, దాని వెనక కేంద్ర మంత్రి, ఎన్టీ రామరావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి పాత్ర కూడా ఉన్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతుల్లోంచి తన తండ్రి ఎన్టీ రామారావు వారసుల చేతిలోకి రావాలని ఆమె గట్టిగా కోరుకుంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications