పోటీపై తండ్రి దారిలో బాలకృష్ణ?

కోస్తా నుండి అయితే దివంగత ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు గ్రామం ఉన్న పెనుమలూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ, సీమ కంటే కోస్తా నుండే పోటీ చేయడానికే ఎక్కువగా ఆస్కారం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అసెంబ్లీ నియోజకవర్గం కాకుండా పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేయాలని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. ఆయన అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే కేవలం రెండు మూడు నియోజకవర్గాల్లోనే ప్రభావం ఉంటుందని, అదే ఏదైనా పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తే చుట్టుపక్కల ఐదారు పార్లమెంటు నియోజకవర్గాల్లో తద్వారా దాదాపు ఎక్కువ మొత్తంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications