ల్యాన్స్ ఆర్మ్‌స్ట్రాంగే యువరాజ్‌కు స్ఫూర్తి

క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకుని తిరిగి ట్రాక్‌లోకి వచ్చిన మరో క్రీడాకారుడు ఆర్మ్‌స్ట్రాంగ్. ఆర్మ్‌స్ట్రాంగ్‌ను కలిసి స్పూర్తి పొందాలని అనుకుంటున్నట్లు యువరాజ్ ట్విట్టర్‌లో చెప్పాడు. ఆర్మ్ స్ట్రాంగ్ యువరాజ్ ట్వీట్‌కు సమాధానం కూడా ఇచ్చాడు. ఆర్మ్‌స్ట్రాంగ్ టెస్టుక్యులర్ క్యాన్సర్‌తో బాధపడ్డాడు. ఆర్మ్‌స్ట్రాంగ్‌కు చికిత్స చేసిన వైద్యుడే యువరాజ్ మళ్లీ చాంపియన్‌గా ముందుకు వస్తాడని హామీ ఇచ్చినట్లు ఆయన తండ్రి యోగరాజ్ ఇటీవల చెప్పాడు. తాను తిరిగి వచ్చి తన ఇండియా జెర్సీని, తన ఇండియా క్యాప్‌ను ధరించి ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు.












Click it and Unblock the Notifications