షర్మిల ముద్దు, మురిపెం: చలాకిగా నడక(పిక్చర్స్)
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర ఆదివారం 2,500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకుంది. గతేడాది అక్టోబర్ 18వ తేదిన ఇడుపులపాయ నుండి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర తొమ్మిది నెలలుగా సాగుతోంది. షర్మిల తన పాదయాత్రలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలపై నిప్పులు చెరుగుతూనే.. ప్రజలతో మమేకమవుతున్నారు.
తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హవాభావాలతో ఆకట్టుకుంటున్న షర్మిల... 2,500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసి ఒక రికార్డ్ సృష్టించారు. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని కాకరాపల్లి గ్రామం వద్ద ఆమె ఈ మైలు రాయిని దాటారు. ఈ సందర్భంగా 24 అడుగుల ఎత్తైన వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని షర్మిల, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె టిడిపి, కాంగ్రెసులపై నిప్పులు చెరిగారు. తన సోదరుడు జగన్ వనవాసం ముగుస్తుందని, ఆయన విలువలు, విశ్వసనీయతకే ప్రాధాన్యతనిచ్చారన్నారు. ఇచ్చిన మాట కోసం కష్టాలు పడినా ముందడుగు వేశారన్నారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాయన్నారు. పది తలలు ఉన్న రావణాసురిడి పైన, కౌరవుల పైన ధర్మమే గెలిచిందన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలను కిరణ్ కుమార్ రెడ్డి నిర్వీర్యం చేయడమే కాకుండా, ఆయన పథకాలను కూడా కాపీ కొడుతున్నారని ధ్వజమెత్తారు. కిరణ్ రెండు పథకాలను మాత్రం బాగా అమలు చేస్తున్నారన్నారు. అన్ని ఛార్జీలను పెంచే పథకం, వైయస్సార్ సంక్షేం పథకాలకు తూట్లు పొడిచే పథకాన్ని మాత్రం సమర్థవంతంగా అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన పాలనను మళ్లీ తెస్తానని చెప్పగలరా అని ప్రశ్నించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రజా సమస్యలపై గత నెల అక్టోబర్ 18న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. ఆదివారంతో 2,500 కిమీ దాటింది.

పాదయాత్రలో షర్మిల ప్రజలతో మమేకమవుతున్నారు. చిన్నారులు, ముసలి వాళ్లతో ముద్దుగా, మురిపెంగా మాట్లాడుతూ సాగుతున్నారు. ఓ చిన్నారని ముద్దాడుతున్న షర్మిల.

పాదయాత్రలో షర్మిల ప్రజలతో మమేకమవుతున్నారు. చిన్నారులు, ముసలి వాళ్లతో ముద్దుగా, మురిపెంగా మాట్లాడుతూ సాగుతున్నారు. ఓ వృద్ధురాలితో మురిపెంగా మాట్లాడుతున్న షర్మిల.

రెండు రోజుల క్రితం ఉపాధి హామీ కూలిలతో మాట్లాడిన షర్మిల తట్టను నెత్తిన పెట్టుకున్న దృశ్యం.

షర్మిలకు ఘన స్వాగతం పలుకుతున్న మహిళలు

తాను జగన్ వదిలిన బాణం అని చెప్పే షర్మిల చేతిలో విల్లంబులు

పాదయాత్రలో తనను కలిసేందుకు వచ్చిన వారితో ముచ్చటిస్తూ ముందుకు సాగుతున్న షర్మిల

అధికారంలోకి రాగానే జనన్న మీ ఆశయాలను కొనసాగిస్తారు... ఆశీర్వదించండి!.. వైయస్ విగ్రహం వద్ద షర్మిల.

తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటోను చేతిపై ముద్రించుకున్న ఓ వ్యక్తితో షర్మిల మాటా ముచ్చట

బస్సులో పాఠశాలకు వెళ్తున్న చిన్నారులకు చేయి అందిస్తున్న షర్మిల












Click it and Unblock the Notifications