కొత్త ఆటగాడితో వెకిలిగా ఉస్మాన్ ఖవాజా

లండన్‌: తొలి మ్యాచ్‌ ఆడుతున్న సహచరుడికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ ఉస్మాన్‌ ఖవాజా అనూహ్య రీతిలో స్వాగతం పలికాడు. న్యూజిలాండ్‌తో ఈనెల 6న వెల్లింగ్టన్‌ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన లెగ్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాతో ఖవాజా వెకిలి చేష్టలు చేశాడు. అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మ్యాచ్‌ మొదలు కావడానికి ముందు జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసీస్‌ ఆటగాళ్లందరూ ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకొని గీతం అలపిస్తుండగా, ఖవాజా మాత్రం తనకు ఎడమ వైపున ఉన్న జంపా వెనుక భాగంలో చేయి వేశాడు. జంపా పిరుదులపై అసభ్య రీతిలో చేతిని కదిలించాడు.

Australia's Usman Khawaja grabs Adam Zampa's butt during pre-match national anthem

మొదట యాదృచ్ఛిచకంగా చేయి వేశాడని అనుకున్నా ఖవాజా చాలా సేపటి వరకూ చేతిని కదిలిస్తూనే ఉన్నాడు. సహచరుడి చేష్టలతో జంపా ఇబ్బంది పడ్డాడు. గీతాలాపన తర్వాత నవ్వడం తప్ప మరేమీ చేయలేకపోయాడు. అయితే ఆసీస్‌ టీమ్‌కు దగ్గర్లో కూర్చున్న ఓ అభిమాని ఈ తతంగాన్నంతా వీడియో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు.

ఈ వీడియోకు దాదాపు రెండు లక్షల పైచిలుకు వ్యూస్‌ వచ్చాయి. అయితే సహచరుడితో తన చేష్టలను ఖవాజా సమర్థించుకున్నాడు. అరంగేట్రం ఆటగాడిని ఆట పట్టించడానికే అలా చేశానని ట్వీట్‌ చేశాడు. ‘మా వెనకాల నుంచి కెమెరాలతో చిత్రీకరించడాన్ని నమ్మలేకపోతున్నా. అదంతా ఇద్దరి అంగీకారంతో జరిగింది. కేవలం అరంగేట్రం ఆటగాడిని ఆట పట్టించానంతేన'ని చెప్పుకొచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+