వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిఘా మొదలైంది: కేసీఆర్‌ను వెంటాడుతున్న కేంద్రం?, గులాబీ నేతల్లో హైఅలర్ట్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Central Trap Around KCR KCR చుట్టూ కేంద్రం వల...

హైదరాబాద్: కేంద్రానికి ఎదురు తిరిగితే ఎక్కడ కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందోనన్న భయం.. దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీ నేతలను వెంటాడుతోంది. కేంద్రం నుంచి న్యాయంగా దక్కాల్సిన వాటి గురించి అడగాలన్నా.. ఆ జంకుతో కొంతమంది వెనుకడుగేస్తున్న పరిస్థితి.

లెక్క గట్టిగానే ఉంది: కేసీఆర్ 'ఢిల్లీ గర్జన' వెనుక వ్యూహాలు, సమీకరణాలు..లెక్క గట్టిగానే ఉంది: కేసీఆర్ 'ఢిల్లీ గర్జన' వెనుక వ్యూహాలు, సమీకరణాలు..

ఇలాంటి తరుణంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం 'థర్డ్ ఫ్రంట్' రూపంలో కేంద్రానికి పెద్ద షాకే ఇచ్చారు. నిన్న మొన్న దాకా తమతో సఖ్యతతో మెలిగినట్టే కనిపించిన కేసీఆర్ లో ఈ అనూహ్య మార్పు బీజేపీకి కూడా రుచించడం లేదు. అందుకే కేసీఆర్ కదలికలపై అప్పుడే నిఘా మొదలైందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 రంగంలోకి నిఘా సంస్థలు:

రంగంలోకి నిఘా సంస్థలు:

థర్డ్ ఫ్రంట్ రూపంలో దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటిని కేసీఆర్ ఒక్కటి చేసే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వ అధీనంలోని దర్యాప్తు సంస్థలు, నిఘా సంస్థలు ఆయనపై నిఘా పెట్టేందుకు సిద్దమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఎఫెక్ట్ కారణంగానే.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సైతం కేసీఆర్ పలు సూచనలు చేసినట్టు చెబుతున్నారు.

 గులాబీ నేతల్లో హైఅలర్ట్..:

గులాబీ నేతల్లో హైఅలర్ట్..:

ఇప్పటినుంచి పార్టీ శ్రేణులు ఎవరైనా సరే కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందని కేసీఆర్ గులాబీ క్యాడర్‌కు సూచించినట్టు తెలుస్తోంది. కీలక నేతల ఫోన్లు ట్యాప్ అయ్యే అవకాశం ఉండటంతో.. వివాదాస్పద లేదా కీలక విషయాలేమైనా ఉంటే ఫోన్ కాల్స్ ద్వారా చర్చించవద్దని ఆయన సూచించినట్టు చెబుతున్నారు.

 రాజకీయ వ్యూహాలు.. ఫోన్‌లో వద్దు:

రాజకీయ వ్యూహాలు.. ఫోన్‌లో వద్దు:

టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఇప్పుడు కాచుకు కూర్చుందని అధినేతకు సంకేతాలు అందినట్టు చెబుతున్నారు. ఈ మేరకు కీలక నేతలంతా అలర్ట్ కూడా ఉండాలని ఆయన నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. రాజకీయ వ్యూహాల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ కాల్స్ సంభాషణ జరపవద్దని ఆయన సూచించినట్టు సమాచారం.

వాట్సాప్ కాల్స్..:

వాట్సాప్ కాల్స్..:

టీఆర్ఎస్ కీలక నేతల ఫోన్ కాల్స్ ట్యాప్ అయ్యే అవకాశం ఉండటంతో.. ఇకనుంచి వాట్సాప్ ద్వారా సంభాషణలు జరిపితే మంచిదని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నట్టు చెబుతున్నారు.

అధినేత ఆదేశాల మేరకు వీలైనంత మేర వాట్సాప్ ద్వారానే ఫోన్ సంభాషణలు జరపడం బెటర్ అని భావిస్తున్నారట. వాట్సాప్ కాల్స్ ను ట్యాప్ చేసే అవకాశం లేకపోవడంతో.. ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు చెబుతున్నారు.

English summary
Central Intelligence groups kept a hawk’s eye on Telangana CM KCR political steps after announcing third front
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X