బాబుకు భారీ షాక్: 'పనామా పేపర్స్'లో హెరిటేజ్ డైరెక్టర్
విజయవాడ: కొద్ది రోజులుగా 'పనామా పేపర్స్' సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ తదితరుల పేర్లు కూడా వినిపించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరి పేర్లు కూడా వచ్చాయి.
తాజాగా, మరో షాకింగ్ అంశం వెల్లడైంది. పనామా పేపర్స్ తాజాగా విడుదల చేసిన జాబితాలో టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ మోటపర్తి శివరామ వరప్రసాద్ పేరు బయటపడ్డట్లుగా మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.
ఎంపీ హోల్డింగ్ అసోసియేట్స్, బాలీవార్డ్ లిమిటెండ్, బిట్ కెమీ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీలతో సంబంధం ఉన్నట్లుగా తేలిందంటున్నారు. పనామాలో మూడుసార్లు ఆయన ప్రస్తావనకు వచ్చింది. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్, పనామా, ఈక్వెడార్‌లో మూడు కంపెనీలు ఉన్నాయని, వీటి ద్వారా పన్నులు ఎగవేశారని ఆరోపణలున్నాయి.

మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం... ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్ కెమీ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీలతో సంబంధం ఉన్న ఆయన పేరు పనామా పేపర్సులో మూడుసార్లు ప్రస్తావనకు వచ్చింది. వరప్రసాద్ పేరు బయటకు రావడంతో చంద్రబాబు పరిస్థితి ఇబ్బందికర పరిస్థితిలో పడిందని అంటున్నారు.
వరప్రసాద్ లావాదేవీల పైన సమగ్ర విచారణ జరిపితే బినామీ ఎవరో తెలిసే అవకాశముందని కూడా పేర్కొంటున్నారు. వరప్రసాద్ పేరు బయటకు రావడంతో టిడిపి నేతల్లో ఆందోళన కనిపిస్తోందని సాక్షి పత్రిక పేర్కొంది.
ప్రసాద్ తనయుడు సునీల్ కూడా బిట్ కెమీ వెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు పనామా వెల్లడించింది. సునీల్.. అమెరికా, హైదరాబాదులలో స్టార్టప్ కంపెనీల్లో ఈ డబ్బును పెట్టుబడి పెట్టునట్లుగా చెబుతున్నారు. ప్రసాద్ ప్రవాస భారతీయుడు కాగా.. హైదరాబాదులో కొన్ని కంపెనీలకు డైరెక్టరుగా వ్యవహరిస్తున్నాడు.
ఆయనకు ఇతర దేశాల్లో వ్యాపారాలున్నాయని తెలుస్తోంది. ప్రసాద్ 2014 నుంచి హెరిటేజ్ ఫుడ్స్‌కు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. కాగా, దీనిపై ప్రసాద్ కూడా స్పందించారు. తాను ప్రవాస భారతీయుడనని, గత 30 ఏళ్లుగా విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నానని చెప్పారు.
తనకు బ్రిటిష్ వర్జీన్ ఐల్యాండులో కూడా కంపెనీలు ఉన్నాయని, పనామా వ్యవహారం గురించి తనకు తెలియదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని కంపెనీ సిబ్బంది, లాయర్లు చూసుకుంటారని చెప్పారని అంటున్నారు. వ్యాపార లావాదేవీలు అన్నీ చట్టబద్దంగా ఉన్నాయన్నారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications