వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెర్మన్ వింగ్స్ క్రాష్: మాజీ ప్రేయసితో కో‌పైలట్ ఇలా..

By Pratap
|
Google Oneindia TeluguNews

ఫ్రాన్స్: ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్సా పర్వతాల్లో 'ఎయిర్‌బస్ ఏ-320' విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేసి 150 మందిని పొట్టన పెట్టుకున్న జర్మనీ వింగ్స్ కో-పైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఒక రోజు తన పేరు అందరికీ తెలుస్తుందని తన మాజీ ప్రేయసితో అన్నట్లు జర్మన్ వార్తాపత్రిక బిల్డ్ రాసింది. 26 ఏళ్ల ఫ్లయిట్ అటెండెంట్ మేరియా డబ్ల్యు - ఆడ్రియాస్ అన్న మాటలను గుర్తు చేసుకుంది. తాను ఒక రోజు ఏదో ఒక పని చేస్తానని, అది మొత్తం వ్యవస్థనే మార్చేస్తుందని, అప్పుడు ప్రతి ఒక్కరూ తన పేరను తెలుసుకుని గుర్తు పెట్టుకుంటారని అతను అన్నట్లు ఆమె చెప్పింది.

ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్సా పర్వతాల్లో 'ఎయిర్‌బస్ ఏ-320' విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేసి 150 మందిని పొట్టన పెట్టుకున్న జర్మనీ వింగ్స్ కో-పైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ మానసిక రోగి అని, విమానాన్ని కూల్చేసిన రోజు వరకు కూడా మానసిక వ్యాధికి కౌన్సెలింగ్ తీసుకున్నాడని ప్రముఖ జర్మనీ వార్తా పత్రిక 'బిల్డ్' శుక్రవారం వెల్లడించింది.

బాత్‌రూమ్‌కు వెళ్లిన పైలట్‌ను తిరిగి కాక్‌పిట్‌లోకి రాకుండా క్యాబిన్ డోర్‌ను లాక్‌ చేసి విమానాన్ని తలకిందులుగా తీసుకెళ్లి పర్వతాల్లో కో-పైలట్ లూబిడ్జ్ కూల్చేసినట్టు గురువారం ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్ వెల్లడించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలనుకున్న గర్ల్ ఫ్రెండ్, రెండు వారాల క్రితం అభిప్రాయ భేదాలొచ్చి తనతో విడిపోయిందని, అప్పటి నుంచి ఆయన మానసిక జబ్బు మళ్లీ తిరగతోడిందని, అందుకోసం సైకో థెరపీ కింద కౌన్సెలింగ్ తీసుకుంటూ వచ్చాడని ఆ పత్రిక పేర్కొంది.

 Germanwings crash: Co-pilot told ex-girlfriend `everyone will know my name`, claims report

తీవ్ర మనస్తాపంతో రగిలిపోతున్న టూబిడ్జ్ విమానాన్ని కూల్చేయడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపింది. 28 ఏళ్ల లూబిడ్జ్ 2008లో పైలట్ శిక్షణ సందర్భంగా కొన్ని నెలలపాటు సెలవు తీసుకొని మానసిక జబ్బుకు సైకో థెరపి తీసుకున్న విషయం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది.

విమాన ప్రమాద సంఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్న పోలీసు అధికారుల బృందం గురువారం నాడు నాలుగు గంటలపాటు మోంటబార్‌లోని కో-పైలట్ లూబిడ్జ్ ఫ్లాట్‌ను శోధించగా ఓ గర్ల్ ఫ్రెండ్‌తో వ్యవహారం ఉన్నట్టు, మానసిక వ్యాధికి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసింది.

పైలట్ శిక్షణ సందర్బంగా కొన్ని నెలలపాటు లూబిడ్జ్ సెలవుపై వెళ్లినట్టు ధ్రువీకరించిన లుఫ్తాన్సా విమానయాన సంస్థ హెడ్ కార్‌స్టెన్ స్పార్.. అతడి మానసిక వ్యాధి విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. లుఫ్తాన్సా విమానయాన సంస్థ తరపున అమెరికాలోని ఆరిజోనాలో పైలట్ శిక్షణ పొందిన లూబిడ్జ్ ఏకంగా ఏడాది పాటు మానసిక వ్యాధికి సైకో థెరపీ తీసుకున్నాడని తెల్సింది.

English summary
The Germanwings co-pilot who crashed his Airbus in the French Alps, killing all 150 aboard, told his ex-girlfriend that "one day everyone will know my name", according to German newspaper Bild.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X