పెద్ద నగదు నోట్ల రద్దుతో.. రెడ్ లైట్ ఏరియాలో సెక్స్ వర్కర్ల కష్టాలు
కోల్ కతా : సామాన్యులంతా కొత్త నోట్ల గందరగోళంలో కొట్టుమిట్టాడుతుంటే.. సెక్స్ వర్కర్ల పరిస్థితి మాత్రం ఎటూ పాలుపోని స్థితి. వచ్చే విటుల నుంచి డబ్బులు తీసుకోకుండా ఉండలేరు.. అలా అని పాత నోట్లు ఇస్తే.. వాటిని ఎలా మార్పిడి చేసుకోవాలో అర్థంకాని పరిస్థితి.
దేశంలో వ్యభిచారం అసాంఘీక కార్యకలాపంగా ఉండడంతో తద్వారా సంపాదించిన డబ్బుకు ఏ రుజువు చూపించాలో తెలియని స్థితిలో ఆందోళన చెందుతున్నారు సెక్స్ వర్కర్స్. ముఖ్యంగా కోల్ కతాలోని అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా అయిన సోనాగచిలో సెక్స్ వర్కర్లంతా ప్రస్తుతం ఇదే విషయమై తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.

విటులు ఇచ్చే రూ.500,రూ.1000నోటును తీసుకుని ఏం చేయాలని? ఒకవేళ తీసుకోకపోయినా తమకే నష్టమని వాపోతున్నారు. రెగ్యులర్ గా తమవద్దకు వచ్చే విటులకు మాత్రం.. మళ్లీ వచ్చేప్పుడు కొత్త నోట్లు తీసుకుని వచ్చి పాత నోట్లు తీసుకువెళ్లాల్సిందిగా సూచిస్తున్నారట. ఇక పెద్ద మొత్తాలతో రెడ్ లైట్ ఏరియాలో అడుగుపెట్టే కస్టమర్ల వివరాలను.. వారు చెల్లించాల్సిన బకాయిలను పుస్తకంలో రాసిపెట్టుకుంటున్నారట. మొత్తానికి పెద్ద నగదు నోట్ల రద్దు ప్రక్రియ సెక్స్ వర్కర్లను తీవ్ర సంకటంలో పడేసినట్టయింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications