తల్లే వంట, కవిత డైనమిక్: రిట్జ్ కవర్‌పై కెటిఆర్

హైదరాబాద్: ప్రముఖ మ్యాగజైన్ రిట్జ్, హైదరాబాద్‌లోని పాపులర్ మ్యాగజైన్ యూ ఆండ్ ఐ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును వేర్వేరుగా ఇంటర్యూ చేశాయి. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తున్నదని మ్యాగజైన్లు చెప్పాయి. రిట్జ్ మ్యాగజైన్ తన కవర్‌ పేజీపై కెటిఆర్ ఫొటోను ప్రచురించి, తెలంగాణ ప్రత్యేక సంచిత అని పేర్కొంది.

గూగుల్ లాంటి ప్రపంచస్థాయి సంస్థలను హైదరాబాద్‌కు రప్పించడం, పబ్లిక్ వైఫై, స్టార్టప్ కంపెనీలకు ఊతం ఇచ్చేలా ఏర్పాటుచేసిన టీ హబ్, యువతకు శిక్షణ ఇచ్చేందుకు, ఉద్యోగాలకు తగిన నైపుణ్యాలు అందించేందుకు టాస్క్ వంటి నూతన వేదికలను ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్ కృషిని ఆ పత్రికలు ఆకాశానికెత్యాయి. ఆ పత్రికల ఇంటర్వ్యూల్లో కెటిఆర్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

27 ఏళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా, 35 ఏండ్ల వయస్సులో క్యాబినెట్ మంత్రి అయిన కెటిఆర్‌ోలని చురుకుదనం, అనుభవం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదని ప్రశంసించాయి. స్పష్టమైన వైఖరిని వెల్లడించడం, ఆకర్షణీయమైన పద ప్రయోగంతో ఆకట్టుకుంటూ ప్రజల్లో మమేకమవ్వడం కేటీఆర్‌కు పెద్ద ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయని వ్యాఖ్యానించాయి.

KTR on Ritz magazine cover page

రిట్జ్ మ్యాగజైన్ ది కంప్లీట్ మ్యాన్ పేరుతో, మ్యాన్ ఆన్ ఏ మిషన్ అని యూ ఆండ్ ఐ కవర్‌పేజీ కథనాన్ని ప్రచురించాయి. ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వడం, శాంతిభద్రతలు అదుపులో ఉంచటం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫలితం సాధించారని కెటిఆర్ అన్నారు

సంక్షేమ పథకాలపై ప్రధాన దృష్టిని కేంద్రీకరించిన ప్రభుత్వం ప్రస్తుతం పక్కాగా అమలు చేసేందుకు కృషిచేస్తోందని చెప్పారు. ఇరిగేషన్, తాగు, సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్, కేజీ టు పీజీ ఉచిత విద్య, డబుల్ బెడ్‌రూం లాంటి పథకాలతో సీఎం కేసీఆర్ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగమయ్యారని అన్నారు. పాలనలో పారదర్శకత, నిజాయితీ అధికారులు, వెంటనే అనుమతులు వచ్చే పర్యావరణ విధానం తెలంగాణ ప్రభుత్వ బలమని తెలిపారు. పుష్కలంగా ఉన్న సహజవనరులు, అద్భుతమైన మానవవనరులు తెలంగాణలో ఉండటం తమకు అదనపు బలమని అన్నారు.

రాజకీయాల్లోకి రావాలని గానీ వద్దని గానీ తన తండ్రి, కెసిఆర్ ఎప్పుడు కూడా చెప్పలేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అయితే 2006లో కరీంనగర్ ఉప ఎన్నికల సందర్భంగా రాజకీయం వైపు అడుగులేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బోర్డింగ్ స్కూళ్లలో తను చదివిన అనుభవం కారణంగా తొలుత రాజకీయాలు ఒకింత భారంగా అనిపించినా కాలం తనకు ఎంతో అనుభవాన్ని నేర్పించిందని చెప్పారు.

ముఖ్యమంత్రికి సతీమణి అయినా ఇప్పటికీ తన తల్లి స్వయంగా వంట చేయడం తనకు ముచ్చటేస్తుందని మంత్రి కెటిఆర్ అన్నారు. పలు సందర్భాల్లో తన తల్లి చెప్పే మాటలు ఎంతో మార్గదర్శకంగా ఉంటాయని, స్ఫూర్తిని కలిగిస్తాయని తెలిపారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడంలో తన సతీమణి శైలిమ సహకారం ఎంతో ఉందన్నారు.

ఉరుకులు, పరుగుల జీవితంలో కుటుంబం కోసం సమయం కేటాయించకపోయినా తన బాధ్యతలను సతీమణి పంచుకోవడం తనకు పెద్ద అండ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తన సోదరి, ఎంపీ కల్వకుంట్ల కవిత ఎంతో డైనమిక్‌గా ఉంటుందని కితాబిచ్చారు. పలు సందర్భాల్లో ఆమెను చూసి స్పూర్తిని పొందుతుంటానని మంత్రి కెటిఆర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+