వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్ర ఉత్కంఠ: ట్రంప్‌కు షాక్, హిల్లరీనే ముందు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తొలుత ట్రంప్, ఆ తర్వాత హిల్లరీ, అనంతరం ట్రంప్‌కు అందనంత దూరంలో హిల్లరీ, ఆ తర్వాత హిల్లరీకి సమీపంలో ట్రంప్.. ఇలా ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఉత్కంఠగా మారింది.

తాజా సర్వేలో హిల్లరీదే ఆధిక్యం అని తేలింది. హిల్లరీ రెండు పాయింట్ల ముందున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మూడున్నర కోట్ల మంది ఇప్పటికే ఓటేశారు. 20 కోట్ల మంది ఎనిమిదో తేదీన ఓటు వేయనున్నారు.

ఫ్యాక్స్ న్యూస్ సర్వేలో డొనాల్డ్ ట్రంప్‌కు 43 శాతం, హిల్లరీకి 45 శాతం ఓట్లు వచ్చాయి. వారం క్రితం 3 శాతం ఆధిక్యంతో, మూడు వారాల క్రితం 6 శాతం ఆధిక్యంతో హిల్లరీ ఉన్నారు. ఎఫ్‌బీఐ దర్యాఫ్తుతో హిల్లరీ ఆత్మరక్షణలో పడ్డారని సర్వేలో తేలింది.

Latest forecast in race for presidency between Hillary Clinton and Donald Trump

సీఎన్ఎన్ తాజా సర్వేలో హిల్లరీకి 268 ఎలక్ట్రోరల్ ఓట్లు వస్తాయని ప్రకటించింది. విజయం కావాలంటే 270 అవసరం. ట్రంప్‌కు 204 ఓట్లు వస్తాయని సీఎన్ఎన్ తేల్చింది. అన్ని సర్వేల్లో సగటున 1.6 శాతం హిల్లరీకి ఆధిక్యం ఉంది. ఆమె గెలిచే అవకాశముందని న్యూయార్క్ టైమ్స్ 67.8 శాతం, వాషింగ్టన్ పోస్ట్ 97.9 శాతంగా అంచనా వేసింది.

హిల్లరీకి సల్మాన్ ఖాన్ మద్దతు

అమెరికా అధ్యక్ష పీఠం కోసం జరుగుతున్న ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మద్దతిచ్చే సినీ ప్రముఖులు పెరుగుతున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ హిల్లరీకి తన మద్దతును ప్రకటించారు. నవంబర్‌ 8న జరిగే పోలింగ్‌లో ఆమెకు విజయం దక్కాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

మీరు గెలుస్తారని నమ్మకముందని, దేవుడు మీకు రాజ్యాంగం, మానవతా విలువల్ని పాటించే శక్తి ఇస్తాడని, ఆల్‌ది బెస్ట్‌ హిల్లరీ క్లింటన్ అని సల్మాన్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆమెకు మద్దతు పలికారు.

English summary
Latest forecast in race for presidency between Hillary Clinton and Donald Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X