• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నయీం చచ్చినా: మహిళా డాన్ బెదిరింపు, వసూళ్ల ఆ స్టైలే వేరు

|

మహబూబ్ నగర్: గ్యాంగ్ స్టర్ నయీం హత్య అనంతరం కూడా బెదిరింపులు వస్తున్నాయని తెలుస్తోంది. అతను ఆక్రమించిన ఆస్తులను తిరిగి పొందవచ్చని భావిస్తున్న బాధితులకు బెదిరింపులు మొదలయ్యాయని తెలుస్తోంది. మా భాయ్ పోయినా అతని నెట్ వర్క్ అలానే ఉందని, నేను నయీం వారసురాలినని, ఎవరైనా మా గ్యాంగ్ గురించి పోలీసులకు వివరాలు చెప్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఓ యువతి ఫోన్లో హెచ్చరికలు చేసినట్లుగా తెలుస్తోంది.

గతంలో నయీం చేతిలో మోసపోయి బాధితులుగా మారిన వారికి ఈ ఫోన్లు వస్తున్నాయని సమాచారం. ఆమె గొంతే భయంకరంగా ఉందని, గడచిన నాలుగేళ్లలో ఎంతోమంది అనుచరులను నయీం తయారు చేసుకున్నాడు

అలా తయారు చేసుకున్న నయీం.. అందులో మహిళల సంఖ్య అధికంగా ఉండేలా చూసుకుని, తనకేదైనా జరిగినా నెట్ వర్క్ దెబ్బతినకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో డెన్‌లను ఏర్పాటు చేసిన నయీం, అత్యధిక డెన్‌లలో మహిళలనే డాన్‌లుగా ఉంచినట్టు తెలుస్తోంది.

నయీం

నయీం

గ్యాంగ్ స్టర్ నయీం హత్య అనంతరం కూడా బెదిరింపులు వస్తున్నాయని తెలుస్తోంది. అతను ఆక్రమించిన ఆస్తులను తిరిగి పొందవచ్చని భావిస్తున్న బాధితులకు నయీం అనుచరుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని తెలుస్తోంది.

నయీం లీలలు ఎన్నో

నయీం లీలలు ఎన్నో

షాపు పెట్టి వ్యాపారం చేయాలన్నా, భూములు కొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ప్రారంభించాలన్నా భాయ్‌ అనుమతి తీసుకోవాల్సిందేనని, ఎవరిదైనా స్థలంపై భాయ్‌ కన్ను పడితే తన భూమిపై యజమాని ఆశ వదులుకోవాల్సిందే నయీంకు సమర్పించుకోవాల్సిందేనని, రెండు దశాబ్దాలుగా నయీం సాగించిన అక్రమ దందాకు చాలామంది బలైపోయారని చెబుతున్నారు.

నయీం లీలలు ఎన్నో

నయీం లీలలు ఎన్నో

భువనగిరి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఓ దుకాణం నడుపుకుంటున్నాడు. అద్దె మడిగెలో కొనసాగుతున్న అతను మరో మడిగె కోసం ఖాళీ స్థలం కొన్నాడు. విషయం తెలిసిన నయీం.. అతనికి ర.రూ. 25 లక్షలు చెల్లించాలని హుకుం జారీ చశాడు. వ్యాపార అవసరం కోసం అప్పు చేశానని, తన వద్ద డబ్బులేదని అతని చెప్పినా విననేదు.

అసలు వదలకుంటే గత్యంతరం లేని ఆ యువ వ్యాపారి అప్పు తెచ్చి మరీ నయీంకు డబ్బులు ఇచ్చాడు.

 బెదిరింపులు

బెదిరింపులు

మరో వ్యక్తి నుంచి నచ్చిందని ఇల్లు గుంజుకున్నాడు. బీడీ కంపెనీ యజమానులను కూడా బెదిరించి డబ్బులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.

 రసీదులు

రసీదులు

వసూళ్లలో నయీం వ్యవహరించే స్టైలే వేరేలా ఉంటుందంటున్నారు. ఎవరినైనా బెదిరించి తనకు కావాల్సింది వసూలు చేసుకునే నయీం... తాను చేసే బలవంతపు వసూళ్లకు సంబంధించి రశీదులు కూడా ఇచ్చేవాడని తెలుస్తోంది.

 రసీదులు

రసీదులు

వచ్చినవారి యోగక్షేమాలు మాట్లాడుతూనే బాధితుల పేరు, కుటుంబసభ్యుల వివరాలతో బయో డేటాను స్వదస్తూరితో రాస్తాడు. ఆ తర్వాత బలవంతంగా ఒప్పించిన నగదు ఏ తేదీలోపు ఇస్తాలో రాస్తాడు. మూడు నెలల గడువు ఇస్తూ.. నాతో అవసరం పడ్డా పని చేయించుకో అని చెబుతాడట. మూడు పేపర్ల పైన వాటిని రాసి.. ఒకటి తన వద్ద, రెండోది డబ్బు ఎవరికి అప్పజెప్పాలో ఆ అనుచరుడికి, మూడో రసీదు బాధితుడికి ఇస్తాడు.

English summary
Telangana police books Nayeem's kin for involvement in illegal activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X