వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పారిశ్రామికవేత్తలకు భరోసా: కర్ణాటకతో పోటీ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఓ వైపు ఢిల్లీ ఆర్థిక సదస్సులో పారిశ్రామికవేత్తలకు భరోసా ఇస్తూ తమ రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇస్తూ నమ్మబలుకుతుంటే, కర్ణాటక ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉలిక్కి పడ్డారు. హీరో హోండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిపోవడాన్ని పరిగణనలోకి తీసుకుని, ఐటి కంపెనీలు కూడా ఎపి తరలిపోతాయనే ఆందోళనతో ఆయన వెంటనే వాణిజ్య, ఐటి శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

కర్ణాటకలోని ఐటి, ఇతర పారిశ్రామికవేత్తలను తనవైపు ఆకట్టుకోవడానికి బెంగళూర్ పర్యటన చేసిన చంద్రబాబు గురువారం ఢిల్లీలో జరిగిన ఎకనమిక్ ఫోరం సదస్సులో పారిశ్రామికవేత్తలకు వలవేసేందుకు ప్రయత్నించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను పెట్టాలనుకునేవారు తగిన ప్రణాళికలతో వస్తే ఆ ప్రణాళికలు అమలయ్యేలా తాను చూస్తానని పలు కార్పొరేట్‌ కంపెనీల అధినేతలు, సీఈవోలు, పారిశ్రామిక వేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ఆధ్వర్యంలో తాజ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన ఇండియన్‌ ఎకనమిక్‌ సమ్మిట్‌-2014 సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నిరంతర విద్యుత్‌, నీటి సరఫరా ఉంటాయనిచెప్పారు. భారీ స్థాయిలో భూములున్న సెజ్‌లు ఏర్పాటు చేస్తున్నామని, అన్ని అనుమతులూ పారదర్శకంగా ఆన్‌లైన్‌లో లభించేలా చూస్తున్నామని వివరించారు. 30 రోజుల్లో ఏ విషయం చెప్పకపోతే డీమ్డ్‌ అనుమతులుగా భావించి కంపెనీలు పనులు చేసుకునేలా విధానాన్ని రూపొందిస్తున్నానని తెలిపారు. ప్రణాళికలతో వచ్చే వారికి సహాయం చేసేందుకు అధికారుల్ని కూడా నియమిస్తానని హామీ ఇచ్చారు.

ఎకనమిక్ ఫోరం సదస్సులో బాబు

ఎకనమిక్ ఫోరం సదస్సులో బాబు

దేశంలో సంస్కరణలను చేపట్టాలని, సంపదను సృష్టించినప్పుడే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు చెప్పారు. అదే సందర్భంలో ప్రజలిచ్చిన రాజకీయ తీర్పును కూడా దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని, తన రాజకీయ జీవితంలో తాను తెలుసుకున్నది ఇదేనని చెప్పారు.

ఎకనమిక్ ఫోరం సదస్సులో బాబు

ఎకనమిక్ ఫోరం సదస్సులో బాబు

సంస్కరణలు చేపట్టేందుకు సిగ్గుపడాల్సిన పనిలేదని, అయితే ప్రజల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. గత కొద్ది నెలలుగా దేశం సరైన పథంలో ముందుకెళుతోందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు తాను కొత్త రాషా్ట్రన్ని, కొత్త రాజధానిని నిర్మించాల్సి ఉందన్నారు. తన అనుభవంతో గత ఐదు నెలలుగా ప్రణాళికలు రచిస్తున్నానన్నారు.

ఎకనమిక్ ఫోరం సదస్సులో బాబు

ఎకనమిక్ ఫోరం సదస్సులో బాబు

రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడాలని, ఆ రకంగా మార్కెట్‌ చేసుకోవాలని చంద్రబాబు చెప్పారు. తాను గతంలో ఐటీ రంగానికి సంబంధించి కర్ణాటకతో పోటీ పడ్డానని, ఇప్పుడు కూడా ఆ పోటీ కొనసాగుతోందన్నారు.

ఎకనమిక్ ఫోరం సదస్సులో బాబు

ఎకనమిక్ ఫోరం సదస్సులో బాబు

ప్రధాని మోదీ దేశ ప్రతిష్ఠ పెంచేలా కృషి చేస్తున్నారని, దేశంలో కూడా సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. దానిని రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలని చెప్పారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu has promised industrialists to felicitate to invest in his state at world Economic forum summit. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X