Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వర్మ 'మెగా పవర్' కలకలం: ఎవరిని ఉద్దేశించి?

విజయవాడ: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పైన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ముద్రగడను ఆయన మెగా పవర్ స్టార్ అని అభివర్ణించారు.

ముద్రగడను మెగా పవర్ స్టార్ అనడం ద్వారా రీల్ హీరోలతో ముద్రగడను పోల్చూత.., రీల్ హీరోల కంటే ముద్రగడ రియల్ హీరో అని ఆయన వ్యాఖ్యల్లో అర్థమవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. వర్మ చేసిన ట్వీట్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

వర్మ ట్విట్టర్లో... కాపు స్కిన్, కమ్మ మైండ్ కలిగిన ఇతర సాధారణ స్క్రీన్ స్టార్లతో పోల్చుకుంటే ముద్రగడ పద్మనాభం నిజమైన మెగా పవర్ స్టార్ అని కితాబిచ్చారు. అంతేకాదు, ముద్రగడ పార్టీ పెడితే తాను అందులో చేరుతానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపేలా ఉన్నాయని అంటున్నారు.

 Ram Gopal Varma arrives in Vijayawada for Vangaveeti script amidst fanfare and tensions

తాను తెరకెక్కిస్తున్న 'వంగవీటి' చిత్రం కోసం రామ్ గోపాల్ వర్మ విజయవాడ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన వరుసగా పలువురితో భేటీ అవుతున్నారు. వంగవీటి సినిమా కోసం కావాల్సిన సమాచారాన్ని ఆయన సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా బెజవాడలో ఉద్వేగ వాతావరణం కనిపిస్తోంది.

రామ్ గోపాల్‌ వర్మ విజయవాడ రాకతో నగర పోలీసుల్లోను ఉత్కంఠ నెలకొంది. అతను దాదాపు రెండేళ్ల తర్వాత నగరానికి వచ్చారని చెప్పవచ్చు. ఇప్పట్లో ఇక్కడకు వచ్చే ప్రసక్తి లేదని ధీమాగా ఉన్న ఖాకీలకు వర్మ వస్తున్నాడని గురువారమే తెలియగానే హైరానా పడ్డారు.

ఆయన సంచరించే ప్రాంతాలన్నీ మొత్తం సెంట్రల్ జోన్‌ ఏరియాలోనివే కావడంతో ఏసీపీ ప్రభాకర్ బాబు, గన్నవరం, కృష్ణలంక, మాచవరం, పటమట, గవర్నరుపేట సీఐలను రంగంలోకి దిగారు. దర్శకుడు విమానాశ్రయంలో దిగింది మొదలు భారీ వాహన ర్యాలీతో మురళి ఫార్చ్యూన్ హోటల్‌కు చేరేవరకు అవాంఛనీయాలు జరక్కుండా పెద్దసంఖ్యలో బలగాలను మోహరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+