డేరా బాబా కూతురు హనీప్రీత్ విరహ వేదన, 16 ఏళ్లకే...

Posted By:
Subscribe to Oneindia Telugu
  Gurmeet Ram Rahim's Honeypreet Wanted to Have Figure Like Katrina kaif | Oneindia Telugu

  సిర్సా: అత్యాచారం కేసులో జైల్లో ఉన్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.

  తవ్వుతున్న కొద్దీ డేరా బాబా చీకటి కోణాలు: రాసలీలల కోసం సొరంగం

  16 ఏళ్ల ప్రాయంలో లవ్ స్టోరీ

  16 ఏళ్ల ప్రాయంలో లవ్ స్టోరీ

  19 సంవత్సరాల క్రితం, ఆమె 16 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో ఓ వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించి, తిరిగి అతని ప్రేమను పొందడంలో విఫలమైంది. డేరాలో జరుగుతున్న సోదాల్లో భాగంగా హనీప్రీత్ గదిలో లభించిన ఓ డైరీలో ఇందుకు సంబంధించిన విషయాన్ని ఆమె రాసుకుంది. తన మనసులోని భావాలను కవితల రూపంలో ఆమె రాసింది.

  అతను ఎవరో?

  అతను ఎవరో?

  అయితే, హనీప్రీత్‌లో ప్రేమను రగిల్చిన వ్యక్తి ఎవరన్న ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. అతను ఎవరన్నదీ, ఎలా ఉంటాడన్నదీ తెలియకపోయినా, ఈ డైరీలోని ప్రతి అక్షరం చూస్తుంటే హనీప్రీత్ అతడిని ఎంతగా ప్రేమించిందో తెలుస్తోందని అంటున్నారు.

  డైరీలో విరహ వేదన

  డైరీలో విరహ వేదన

  నా మనసు విరిగిపోయిందని, నువ్వు పరిచయం కాకుండా ఉండేబాగుండునని, ఈ నిరీక్షణకు అంతం ఎప్పుడంటూ ఆమె తన విరహ వేదనను డైరీలో రాసుకుంది. ఆమె ప్రేమ అన్న మాటకు ఎన్నో నిర్వచనాలు చెప్పుకుంది.

  డైరీ మరిచింది

  డైరీ మరిచింది

  హనీప్రీత్ డేరా నుంచి తను వెళ్తూ వెళ్తూ వేలాది సీసీ కెమెరాల ఫుటేజీని ధ్వంసం చేసింది. గుర్మీత్ అకృత్యాలకు అదనపు సాక్ష్యాలు లేకుండా చేసింది. కానీ తాను దాచుకున్న డైరీని మాత్రం మరిచిపోయింది. అది అధికారుల కళ్లలో పడింది.

  డ్రైవర్ అరెస్ట్

  డ్రైవర్ అరెస్ట్

  మరోవైపు, హనీప్రీత్ కారు డ్రైవర్‌ను హర్యానా పోలీసులు రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. హనీప్రీత్ కోసం గాలిస్తున్న పోలీసులకు ఆమె డ్రైవర్ దొరికాడు. డ్రైవర్ ప్రదీప్ కుమార్‌ను హర్యానా పోలీసులు రాజస్థాన్‌లోని సలావర్‌లో అరెస్టు చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Honeypreet Insan is Gurmeet Ram Rahim Singh's 'favourite angel. She's also as multitalented as her father.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి