విండిస్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు: ఎవరీ సిమ్మన్స్?
ముంబై: వరల్డ్ టీ20లో రెండో సెమీ పైనల్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ మ్యాచ్‌కు ముందు సమీకరణాలన్నీ విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ చుట్టూనే తిరిగాయి. జాతీయ మీడియా సైతం బ్యాటింగ్‌లో వీరిద్దరి మధ్యనే హోరా హోరీ పోటీ ఉంటుందని ఆకాశానికి ఎత్తింది. అయితే అందరి దృష్టి వీళ్లిద్దరిపై ఉండగా.. మధ్యలో మూడోవాడిగా వచ్చి వెస్టిండిస్‌ను పైనల్‌కు తీసుకెళ్లాడు.
తనకు బాగా కలిసొచ్చిన బ్యాట్‌ను వెంట తెచ్చుకున్న లెండిన్ సిమ్మన్స్. పాకిస్థాన్‌ను పాత రేసి.. బంగ్లాను అడ్డుకొని.. ఆస్ట్రేలియా సవాల్ ఛేదించుకొని సెమీస్ వచ్చిన టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ వేసి, శతకోటి భారత ఆశలపై నీళ్లు చల్లాడు. వాస్తవానికి నాలుగు రోజుల క్రితం వరకు సిమ్మన్స్ విండిస్ జట్టులో లేడు.

ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విండిస్ ఆటగాడు ఫ్లెచర్‌కు గాయం కావడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చాడు. టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ మ్యాచ్ ఆడిన సిమ్మన్స్ వెస్టిండిస్‌ను పైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న క్రమంలో సిమ్మన్స్ మాట్లాడాడు.
అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత మా జట్టు మేనేజ్‌మెంట్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. వరల్డ్‌కప్ ఆడడానికి ఫిట్‌గా ఉన్నావా అని అడిగారు. అవునని చెప్పా. ఐపీఎల్‌లో నేను ముంబైకే ఆడుతున్నాను. ఆ పిచ్ గురించి నాకు బాగా తెలుసునని కూడా చెప్పాను. భారత్‌కు వచ్చేటప్పుడు విమానంలో ప్రయాణ సమయమంతా పూర్తిగా నిద్రకే కేటాయించాను.

ఈ మ్యాచ్‌లో అదృష్టం కలిసి వచ్చి మూడు సార్లు ఔట్ కాకుండా ఉండటం వల్లే జట్టు విజయానికి బాటలు వేసింది. ఏదేమైనా నా బెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఇది ఒకటి అని పేర్కొన్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌ను త్వరగా ఔట్ చేసింది.
దీంతో టీమిండియా అభిమానులంతా విజయం భారత్‌దే అని పిక్స్ అయిపోయారు. ఆ తర్వాత శామ్యూల్స్ తక్కువ స్కోరుకే వెనక్కి పంపామన్న సంతోషం. అయితే ఈ రెండింటిని సిమ్మన్స్ ఎంతోసేపు నిలవనీయలేదు. విండిస్ ఓపెనర్ చార్లెస్‌తో కలిసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
వాస్తవానికి సిమ్మన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ ఓపెనర్‌గా మన్స్‌కు వాంఖడె పిచ్ కొట్టినపిండే. అంతేకాదు భారత్‌పై అతనికి మెరుగైన రికార్డు కూడా ఉంది. పిచ్ గురించి అణువణువూ తెలిసిన సిమ్మన్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒంటి చేత్తో సిక్సర్లు కొడుతూ విండిస్ ఆటగాళ్లలో గెలుపుపై ఆశలు కల్పించాడు.
Simmons This Week
— westindies (@westindies) 31 March 2016
SUN: catch flight
MON: arrive Mumbai
TUES: get a rest
WED: training
THUR: Man of the Match#WT20 pic.twitter.com/6DnsQe54QC
సిమ్మన్స్‌కు ఆరంభంలోనే అశ్విన్ వేసిన నోబాల్ అతడిని ప్రాణం పోయగా, యువ ఆల్‌రౌండర్ పాండ్యా మరో నోబాల్‌తో అతణ్ణి హీరోని చేశాడు. వివరాల్లోకి వెళితే.... రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఏడవ ఓవర్లో చార్ల్స్‌కు ఇచ్చిన జీవదానం, హార్డిక్ పాండ్య 14వ ఓవర్లో లెండిల్ సిమ్మన్స్‌కు వేసిన నోబాల్స్ వెస్టిండీస్‌ను విజయం దిశగా నడిపించాయి.
చార్ల్స్ భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడుతున్న దశలో అశ్విన్ సంధించిన బంతిని కట్ చేసేందుకు ప్రయత్నించాడు. దీనిని అద్భుతంగా అందుకున్న బుమ్రా, చార్ల్స్ అవుట్ అని భావించాడు. అయితే థర్డ్ అంపైర్ దానిని నోబాల్‌గా గుర్తించి నాటౌట్‌గా ప్రకటించాడు. దాంతో చార్ల్స్ బతికిపోయాడు.
ఆ తర్వాత 14వ ఓవర్లో హార్డిక్ పాండ్య వేసిన బంతిని లెండిల్ సిమ్మన్స్ భారీ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. దీనిని అశ్విన్ ఒడిసి పట్టాడు. అంతా అవుట్ అని భావించారు. థర్డ్ అంపైర్ నోబాల్‌గా దీనిని ప్రకటించడంతో అది నాటౌట్ అయింది. చివరిగా 18వ ఓవర్లో బుమ్రా వేసిన బంతిని జడేజా బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా పట్టుకున్నాడు.
కానీ, చివర్లో కాలు బౌండరీ లైన్ ను తాకడంతో అది సిక్సర్ గా మారింది. ఇలా ఔటైపోయానని పెవిలియన్ దారి పట్టిన ప్రతిసారి.. నాటౌట్‌గా తేలి క్రీజులోకి వచ్చేటప్పుడు సిమన్స్ ముఖంలో ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. మంచు ప్రభావంతో బౌలర్లు బంతిపై పట్టు తప్పి.. మైదానంలో పరుగుల వరద పారింది.
Fortune Favours the BRAVE!
— Lendl Simmons (@54simmo) 31 March 2016
Great win by both Teams today, I'm happy to contributed#WI #RallyHard #Finals #Champion pic.twitter.com/6c4KTqwYXT
టీమిండియా మాత్రం సెమీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, వెస్టిండిస్ మాత్రం దీనిని ఒక మ్యాచ్‌గానే చూసింది. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లు ఆడుతూ ఒత్తిడిని ఎలా ఎదుర్కొవాలనే విషయంలో విండిస్ ఆటగాళ్లు రాటుదేలారు. దీంతో 193 పరుగుల విజయ లక్ష్యం వారి ముందు చిన్నబోయింది.
భారత బౌలింగ్ విభాగమంతా విండిస్ విధ్వంసక బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌పై దృష్టిసారిస్తే... చార్లెస్, సిమన్స్, రసెల్ పరుగుల వరద పారించారు. గేట్ ఔట్ అయినప్పటికీ, విండిస్ ఆటగాడు సిమ్మన్స్ కొండంత లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి వెస్టిండిస్‌ను ఫైనల్‌లోకి తీసుకెళ్లాడు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications