ఐపీఎల్ ఫైనల్: SRH Vs RCB, ఆసక్తికర విషయాలు
బెంగుళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 9వ ఎడిషన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ పైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఫైనల్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో తలపడనుంది.
వార్నర్ వీరోచిత పోరు, యువీ ఫెయిల్: ఫైనల్లోకి హైదరాబాద్
ఫైనల్‌కు చేరాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌ను చిత్తుచేసింది. గుజరాత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయిన రైజర్స్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 93 పరుగులు చేసి జట్టును పైనల్లోకి చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.

58 బంతులాడిన డేవిడ్ వార్నర్ 11 ఫోర్లు, 3 సిక్సర్లతో లయన్స్ బౌలర్లపై విరుచుపడి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో బిపుల్ శర్మ 11 బంతుల్లో 27 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా అది రికార్డు అవుతుంది.
SRH Vs RCB జట్ల మధ్య ఆసక్తికర అంశాలు:
* ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఆడటం ఇదే తొలిసారి
* గురువారం ఏబీ డివిలియర్స్ సాధించిన 79 పరుగులు, శుక్రవారం డేవిడ్ వార్నర్ సాధించిన 96 పరుగులే గుజరాత్ లయన్స్ జట్టుని ఫైనల్స్‌లోకి రాకుండా అడ్డుకున్నాయి.
* ఐపీఎల్ 9వ ఎడిషన్‌లో డేవిడ్ వార్నర్ మూడు సార్లు 75కు పైగా పరుగులు సాధించాడు. మూడు సార్లు కూడా 90కి పైగా పరుగులు సాధించడం విశేషం.
* ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు 90కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ చరిత్ర సృష్టించాడు. ఐదు సార్లు 90కి పైగా పరుగులు సాధించిన అన్ని మ్యాచ్‌ల్లో ఆ జట్టు విజయం సాధించింది.
* ఐపీఎల్ 9వ ఎడిషన్‌లో డేవిడ్ వార్నర్ 468 పరుగులు సాధించాడు. ఐపీఎల్ సీజన్‌లో ఒక బ్యాట్స్ మెన్ సాధించిన అత్యధిక పరుగులివే
* 700కి పైగా పరుగులు సాధించిన నాల్గవ ఆటగాడిగా డేవిర్ వార్నర్ చరిత్ర సృష్టించాడు. క్రిస్ గేల్ రెండు సార్లు ఈ రికార్డుని అధిగమించాడు.
* ఐపీఎల్‌లో టైటిల్ బరిలో హైదరాబాద్, బెంగుళూరు జట్లు తలపడటం ఇది రెండోసారి. 2009లో జరిగిన ఎడిషన్‌లో ఈ రెండు జట్ల తలపడ్డాయి. ఆ సమయంలో హైదరాబాద్ జట్టు పేరు డెక్కన్ ఛార్జర్స్. ఈ సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ విజయం సాధించింది.
* మే 29 (ఆదివారం) జరగనున్న ఐపీఎల్ పైనల్ మ్యాచ్ బ్యాట్స్‌మెన్ Vs బౌలర్లుగా క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ జట్టులో అద్భుతమైన బ్యాట్స్ మెన్లు ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారని చెబుతున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications