టెక్కీ హత్యలో ట్విస్ట్: నిందితుడితో స్వాతికి ఫ్రెండ్‌షిప్! పక్కా ప్లాన్..

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతికి నిందితుడు రామ్ కుమార్ ముందే తెలుసా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, అతని ప్రేమ వేధింపులు భరించలేక ఆమె ఓసారి అతనిని కొట్టిందని, తన ప్రేమను అంగీకరించనందుకు ఆ ప్రేమోన్మాది స్వాతిని బలి తీసుకున్నాడని చెబుతున్నారు.

బీఈ ఫైనల్ ఇయర్ ఆరియర్స్ పేపర్లు పూర్తి చేసుకునే నిమిత్తం మూడు నెలలకు ముందు రాం కుమార్ చెన్నై వచ్చాడు. చూలైమేడులోని ఓ హాస్టల్లో బస చేశాడు. అదే ప్రాంతంలో నివసించే స్వాతి ఉద్యోగం నిమిత్తం రోజు ఉదయం రైల్వే స్టేషన్ వెళ్తుండేది.

టెక్కీ స్వాతి హత్య, వీడిన మిస్టరీ: తొలిచూపు ప్రేమ, పిచ్చోడని..

ఓసారి రామ్ కుమార్ పరిచయమయ్యాడు. అతను ఆమెతో మాటలు కలిపాడు. ఆమె క్యాజువల్‌గా మాట్లాడింది. తాను బీఈ చదివానని, ఓ మల్టీనేషనల్ కంపెనలో ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నానని మాయమాటలు చెప్పాడు.

అయితే, నీ వ్యక్తిగత విషయాలు నాకు అవసరం లేదని, స్వాతి చెప్పేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రాం కుమార్ ప్రేమ పేరుతో ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఆ లోగా రాం కుమార్ ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నాడని స్వాతికి స్నేహితుల ద్వారా తెలిసింది.

టెక్కీ స్వాతి హత్య కేసు: ఎవరీ రామ్ కుమార్, ఎలా పట్టుకున్నారు?

నిత్యం అతను ప్రేమించాలని వేధిస్తుంటే.. తమది మధ్య తరగతి కుటుంబం అని, మా నాన్నకు తోడుగా ఉంటూ కుటుంబ పోషణ చేస్తున్నానని, తనను వదిలేయాలని ఆమె అతనిని వేడుకుంది. కానీ ఆమె మాటలను రాం కుమార్ పట్టించుకోలేదు. స్వాతిని వేధించడం ఆపలేదు. ఓసారి అతనిని కొట్టినట్లుగా కూడా తెలుస్తోంది.

పోలీసుల వాంగ్మూలంలో అతను హత్య చేసినట్లు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. నన్ను ప్రేమించమని స్వాతిని ఎంతో బతిమాలానని, కానీ తాను నా మాటలను పట్టించుకోలేదని, తన ప్రేమను చీకొట్టినందునే, తనకు దక్కని స్వాతి మరెవరికీ దక్కవద్దని చంపేసానని రాంకుమార్ నేరాన్ని అంగీకరించాడు.

టెక్కీ స్వాతి హత్య

టెక్కీ స్వాతి హత్య


స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్ కుమార్‌ను కేవలం మూడంటే మూడు నిమిషాల ఆపరేషన్లో పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. అతని అరెస్ట్ ప్లాన్ చాలా పకడ్బందీగానే సాగింది. తమిళనాడు పోలీసు వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం... హైదరాబాద్ ఫోరెన్సిక్ నిపుణులు రామ్ కుమార్ హైరెజల్యూషన్ ఫోటోలను విడుదల చేసిన తర్వాతనే అతని జాడ తెలిసింది.

 టెక్కీ స్వాతి హత్య

టెక్కీ స్వాతి హత్య

సెంగొట్టాయ్ సమీపంలోని మీనాక్షిపురం గ్రామంలో అతని చిరునామాను తెలుసుకుని ఆ సమాచారాన్ని తేన్ కాశి పోలీసులకు తెలిపారు. తిరునల్వేలి రేంజ్ డీఐజీ ఆర్ దినకరన్, ఎస్పీ విక్రమన్‌లు స్వయంగా ఈ ఆపరేషన్ నడిపించారు.

టెక్కీ స్వాతి హత్య

టెక్కీ స్వాతి హత్య

తేన్ కాశీ పోలీస్ స్టేషన్లో మకాం వేసిన వీరు, నిందితుడు ఇంటికి వచ్చేంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, అతని ఇల్లు గ్రామం మధ్యలోని అంబేద్కర్ కాలనీలో ఉండటంతో, భారీగా పోలీసులు వెళ్లవద్దని, మఫ్టీలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఆపై పోలీసులను సంచరించవద్దని చెప్పి నిందితుడి రాకను తెలుసుకునేందుకు ఇద్దరిని మాత్రమే అక్కడ ఉంచారు. ఇక స్వాతి హత్యానంతరం రాం కుమార్ స్వగ్రామానికి వెళ్లి పొలాల్లో దాక్కుంటూ తిరిగాడు. మరో చిన్న ఇంట్లోను దాక్కున్నాడు.

టెక్కీ స్వాతి హత్య

టెక్కీ స్వాతి హత్య


ఇక రాత్రి 10 గంటల సమయంలో పోలీసు ఆపరేషన్ ప్రారంభమైంది. సబ్ ఇన్‌స్పెక్టర్ సహాయ సెల్విన్, కానిస్టేబుళ్లు కాలిముత్తు, షణ్ముగం, మహేష్‌లు బయలుదేరారు. వీరెవరికీ రాం కుమార్‌ను ఏ నేరంపై అరెస్ట్ చేయనున్నామన్న విషయం తెలియదు. ఓ కేసులో అతన్ని పట్టుకోవాలన్నది మాత్రమే వీరికి చెప్పారు.

టెక్కీ స్వాతి హత్య

టెక్కీ స్వాతి హత్య

ఇక రాం కుమార్ ఇంటి చుట్టుపక్కలా కరెంటును తీసేసిన వీరు నెమ్మదిగా అక్కడికి వెళుతున్న క్రమంలో కుక్కలు విపరీతంగా మొరుగుతుంటే.. కొందరు గ్రామస్థులు అడ్డుకోగా, తాము పోలీసులమని చెప్పారు. రాం కుమార్ ఇంటిముందు అతని తండ్రి పరమశివమ్ పడుకొని ఉండగా, లేపి కొడుకు ఎక్కడున్నాడో చెప్పాలని అడిగారు. ఇంటి పక్కనే ఉన్న ప్రాంతాన్ని చూపించాడు.

టెక్కీ స్వాతి హత్య

టెక్కీ స్వాతి హత్య

తల్లి పుష్ప, ఇద్దరు చెల్లెళ్లు ఇంట్లోనే నిద్రిస్తుండగా, పోలీసులు రాం కుమార్ ఉన్న చోటికి వెళ్లారు. అప్పటికే టీవీ చానళ్లు, పేపర్లలో ఫోటోలు ప్రచురితం కావడంతో తమ బిడ్డ అరెస్ట్ తప్పదని వారికి ముందే తెలుసు. ఇక పోలీసులను చూడగానే రాం కుమార్ ఆత్మహత్యాయత్నం చేసుకోగా, అతన్ని ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Swathi has friendship with murder suspect Ramkumar, says sources. But commissioner of police Rajendran neither deny nor agree this.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి