ఎంసెట్ లీక్- తెలివిగా డీల్, శిక్షణ కూడా: ఎవరీ రాజగోపాల్?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఎంసెట్ 2 పరీక్ష లీకేజ్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. లీకేజ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు రాజగోపాల్ రెడ్డి అలియాస్ గోవింద రెడ్డి. ఇతను లక్షలాది మంది విద్యార్థుల జీవితోలతో చెలగాటమాడుతున్నాడు.

గతంలో ఇతను ఓ బ్యాంక్‌ ఉద్యోగి. అనంతపురంకు చెందిన ఇతను బెంగళూరులోని కోరమంగళం ప్రాంతంలో స్థిరపడ్డాడు. విజయ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ 2005లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. కర్ణాటక, ఉమ్మడి ఏపీలలో విద్యారంగంలోని అనేక మందితో అతనికి సత్సంబంధాలు ఉన్నాయి.

ఆ సంబంధాలను అడ్డు పెట్టుకుని లీకేజీ దారిలో ధనార్జ ఆరంభించాడు. 2007-13ల మధ్య రాజగోపాల్ రెడ్డి పైన కర్ణాటకలో పలు కేసులు నమోదయ్యాయి. 2007 రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైసెన్స్‌ వైద్యవిద్య ప్రశ్నపత్రం లీక్‌ చేశాడు.

2013లో కన్సార్టియం ఆఫ్‌ మెడికల్‌, ఇంజినీరింగ్‌ అండ్‌ డెంటల్‌ కాలేజెస్‌ ఆఫ్‌ కర్ణాటక ప్రవేశ పరీక్ష పత్రం కూడా బహిర్గతం చేసినట్లు అతని పైన కేసు ఉంది. బెంగళూరు సీబీఐతో పాటు పలుచోట్ల అతని పైన కేసులు నమోదయ్యాయి.

ఎంసెట్ 2 రద్దు: మంత్రి వద్ద విద్యార్థుల కంటతడి, ఎంసెట్ 1 కూడా లీక్

తన వద్ద డ్రైవర్‌గా పని చేసిన అహ్మద్‌ సాయంతో 2014లో పీజీ మెడికల్‌ ప్రవేశ పరీక్ష పత్రం లీక్ చేశాడు. మణిపాల్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ సంస్థలో ప్రవీణ్‌ అనే తన వ్యక్తిని ఉద్యోగిగా చేర్పించి అతని ద్వారా పీజీ మెడికల్‌ ప్రవేశపరీక్ష పత్రాన్ని సాధించాడు.

ముద్రణ సమయంలో ప్రశ్నపత్రం ఒకటి కింద పడగా సీసీ కెమెరాలకు చిక్కకుండా దానిపై తొలుత చేతిలో ఉన్న టవల్‌ను ప్రవీణ్‌ పడవేశాడు. టవల్‌ను తీసుకునే నెపంతో ప్రశ్నపత్రం కూడా పట్టుకొని సరాసరి మరుగు దొడ్డిలోకి వెళ్ళాడు. అక్కడ ప్రశ్నపత్రాన్ని తన లోదుస్తుల్లో దాచుకొని అహ్మద్‌కు అందజేశాడు. దీన్ని చేజిక్కించుకున్న రాజగోపాల్‌ రూ.కోట్లు ఆర్జించాడు. రాజగోపాల్‌ను బెంగళూరులో అరెస్ట్ చేశారు.

Three agents grilled over Eamcet- II paper 'leakage'

డీల్ కుదిరిన విద్యార్థులకు...

డీల్ కుదిరిన విద్యార్థులను రాజగోపాల్‌‌కు చెందిన వ్యక్తులు తొలుత హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ ప్రాంతంలోని ఒక అపార్టుమెంట్లో ఉంచి కొద్దిరోజులపాటు శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత ప్రాంతాల వారీగా బ్యాచ్‌లుగా విభజించారు. పరీక్షకు రెండు రోజుల ముందు విమానాల్లో బెంగళూరు, ముంబై, గోవా తదితర ప్రాంతాలకు తరలించారు. కొందరిని హైదరాబాద్‌లోని వివిధ రిసార్టుల్లో ఉంచారు.

అయితే, ఎవరూ ఫోన్లు మాత్రం తీసుకురావద్దని నిబంధన పెట్టారు. ప్రశ్నపత్రాలు తీసుకొచ్చిన మరో ముఠా అక్కడకు చేరుకుని విద్యార్థులకు వాటిని చూపించింది తప్ప వారి చేతికివ్వలేదు. మొత్తం రెండు సెట్లకు చెందిన ప్రశ్నలకూ విద్యార్థులకు జవాబులు చెప్పి సిద్ధం చేయించారు. ఎంసెట్ 2కు ముందు రోజు వారివారి పరీక్ష కేంద్రాల వద్దకు చేర్చారు.

తెలివిగా ర్యాంకులు

ఒకే కోచింగ్‌ సెంటర్‌కో, ఒకే ప్రాంతం వారికో వరుసగా ముఖ్యమైన ర్యాంకులు వస్తే అనుమానం వస్తుందని భావించి పలు జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థులు చెల్లించిన డబ్బు, ఎంసెట్ 1లో వారికి వచ్చిన మార్కులు ప్రాతిపదికన ఎవరెవరికి ఎన్ని ప్రశ్నలు ఇవ్వాలో ముందుగానే నిర్ణయించారు.

ఎక్కువ డబ్బు చెల్లిస్తామన్న వారికి 145 వరకూ మార్కులు వచ్చేలా, తక్కువ చెల్లించిన వారికి 120 వరకూ మార్కులు వచ్చేలా... ఇలా ఒక్కో విద్యార్థి విషయంలో ఒక్కోలా వ్యవహరించింది. మొత్తం ఓ మాఫియా తరహా ఈ కుంభకోణానికి పాల్పడ్డారు.

ఎంసెట్ 2లో తేడా ఎక్కడొచ్చింది?: తీగ లాగుతున్న సీఐడీ, భారీ ఒప్పందం

అంతేకాదు, కుంభకోణం బయటపడ్డా తమపేర్లు బయటపడకుండా విద్యార్థులతో రాజగోపాల్ ప్లాన్‌గా వ్యవహరించాడు. బేరం కుదిర్చేది ఒకరు, సీక్రెట్ ప్రాంతానికి తరలించేది ఒకరు, ప్రశ్నాపత్రాలు చూపించేది మరొకరు.. ఇలా ఉంటారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ మొదటి నుంచి పలు మలుపులు తిరుగుతోంది. తేదీలు మారుతున్నాయి. తొలుత ఎంసెట్‌ను మే 2వ తేదీన నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు సహాయ నిరాకరణ నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షను వాయిదా వేసి కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే మే 15న ఎంసెట్‌ను నిర్వహించారు.

అనంతరం వైద్య విద్య సీట్లకు నీట్‌ తప్పనిసరని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. దాంతో ఎంసెట్ 1 ద్వారా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశం ఉండదని, ఇతర కోర్సులకు మాత్రమేనని అధికారికంగా ప్రకటించారు. అయితే, సుప్రీం తీర్పు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తెచ్చింది. అనంతరం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌కు ప్రత్యేకంగా ఎంసెట్ నిర్వహించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Three agents grilled over Eamcet- II paper 'leakage'.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి