మోడీ కోసం ఎదురుచూస్తున్న ట్రంప్: వీటిపైనే కీలక చర్చ

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌తో
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి సమావేశం కానున్నారు. జూన్ 26న వీరిద్దరూ భేటీ అవుతున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.

కాగా, మోడీతో సమావేశం కోసం డొనాల్డ్ ట్రంప్‌ ఎదురుచూస్తున్నారంటూ వైట్‌హౌజ్ మీడియా కార్యదర్శి సీన్‌ స్పైసర్‌ తెలిపారు. అమెరికా-భారత్‌ ద్వైపాక్షిక సంబంధాలపై ట్రంప్‌, మోడీ చర్చిస్తారని చెప్పారు.

Trump, Modi to discuss security cooperation, combating terror

ఇరు దేశాల్లోని పౌరుల కోసం లాభదాయకమైన నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. అంతేగాక, ఉగ్రవాదంపై పోరు, ఆర్థిక పెరుగుదల, సంస్కరణలు, వీసా అంశం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రతపరమైన చర్యల విస్తరణవంటి అంశాలపై చర్చలు జరుపుతారని స్పైసర్‌ వెల్లడించారు.

భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఇప్పటికే ఖరారైన విషయం తెలిసిందే. జూన్‌ 25న మోడీ అమెరికా బయల్దేరనున్నారు. 26న ట్రంప్‌తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా హెచ్‌1 బీ వీసాలు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రత, రక్షణ రంగంలో సహకారంపై ఇరువురు చర్చించే అవకాశాలున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
President Donald Trump and Prime Minister Narendra Modi during their first meeting would set forth a vision to expand the US-India ties in an ambitious manner and discuss ways to advance common goals like fighting terrorism and expanding security cooperation in the Indo- Pacific region.
Please Wait while comments are loading...