ChatGPT సృష్టికర్త ఉద్యోగం ఊడింది: కొత్త సీఈఓగా మిరా

వాషింగ్టన్: ఈ మధ్యకాలంలో అందరి నోళ్లల్లో నానుతున్న పదం ఛాట్ జీపీటీ (ChatGPT). ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ (Artificiali Intelligence, AI) ను మించిన టెక్నాలజీ టూల్ ఇది. ఇప్పుడున్న డిజిటల్‌ ప్రపంచంలో అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్‌లను తలదన్నేలా దీన్ని డెవలప్ చేశారు. కోరిన సమాచారాన్ని క్షణాల్లో మన ముందు ఉంచగలిగే సామర్థ్యం దీనికి ఉంది.

దీన్ని సృష్టించింది ఓపెన్ ఏఐ (OpenAI) అనే సంస్థ. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఛాట్ జీపీటీ- ఈ కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) బ్రెయిన్ ఛైల్డ్‌‌గా చెబుతుంటారు. ఆయన ఆలోచనలకు ప్రతిరూపంగా ఈ టూల్ రూపుదిద్దుకుంది.

ChatGPT maker Open AI CEO Sam Altman ousted, Mira Murati takes charges

ఛాట్ జీపీటీ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మానవ వనరుల వినియోగం మరింత తగ్గుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఉద్యోగాల్లో భారీగా కోత పడొచ్చనే అభిప్రాయాలు కార్పొరేట్ సెగ్మెంట్‌లో నెలకొని ఉన్నాయి.ఇప్పుడు దాని సృష్టికర్త సామ్ ఆల్ట్‌మన్‌ ఉద్యోగానికే ఎసరు పడింది. తన ఉద్యోగాన్ని కోల్పోయారాయన.

సంస్థ సీఈఓగా సామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించినట్లు ఓపెన్ ఏఐ బోర్డ్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సామ్‌పై నమ్మకం కోల్పోవడం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ఆయన సారథ్యంలో ఓపెన్ ఏఐ సుదీర్ఘకాలం పాటు మనుగడ సాగించలేదనే అభిప్రాయానికి వచ్చామని పేర్కొంది.

2015లో ఓపెన్ ఏఐ సంస్థను నెలకొల్పింది కూడా ఆల్ట్‌మానే. ఓ నాన్ ప్రాఫిట్ రీసెర్చ్ లాబొరేటరీగా దీన్ని ప్రారంభించారు. ఆ తరువాత దీన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థగా మార్చారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఛాట్ జీపీటీని రూపొందించిందా సంస్థ. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) దీనికి ఫండింగ్ సమకూర్చింది మొదట్లో.

ఓపెన్ ఏఐ నుంచి తాను బయటికి వచ్చిన విషయాన్ని ఆల్ట్‌మన్ నిర్ధారించారు. దీనిపై తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో కొంత సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఓపెన్ ఏఐని ఎంతగానో ఇష్టపడ్డానని, తన వ్యక్తిగత ప్రపంచాన్ని మార్చేసిందని వ్యాఖ్యానించారు. ఎంతోమంది ప్రతిభావంతులతో కలిసి పని చేసే అవకాశం దక్కిందని వ్యాఖ్యానించారు.

కాగా- ఓపెన్ ఏఐ కొత్త సీఈఓగా మిరా మురతి అపాయింట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఇదే సంస్థలో చీప్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పని చేస్తోన్నారు. మిరా మురతిని ఇంటెరిమ్ సీఈఓగా నియమించామని ఓపెన్ ఏఐ బోర్డు వెల్లడించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చాయని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+