రిలయన్స్ జియో కొత్త ప్లాన్ కేక

భారతదేశంలోని వివిధ టెలికాం కంపెనీల మధ్య ప్రస్తుతం తీవ్రమైన పోటీ ఉంది. అవి తమ వినియోగదారులను నిలుపుకోవడానికి, కొత్త వినియోగదారులను చేరుకోవడానికి నిరంతరం ఒకదాని తర్వాత మరొకటి కొత్త ప్లాన్‌లను ప్రారంభిస్తున్నాయి. రిలయన్స్ జియో కొత్తగా తెచ్చిన ప్లాన్‌కి అదనపు OTT సేవలను కూడా జోడించింది.

కొంతకాలంగా భారతదేశంలో OTT ప్లాట్‌ఫారమ్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. టెలికాం కంపెనీలు ఈ పాపులారిటీని ఉపయోగించుకుని తమ ప్లాన్‌లను కూడా ప్రాచుర్యంలోకి తెస్తున్నాయి. టెలికాం కంపెనీలు వివిధ ప్లాన్‌లతో వేర్వేరు OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సభ్యత్వాన్ని అందజేస్తున్నాయి. రిలయన్స్ జియో కూడా అటువంటి ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఉచిత అమెజాన్ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ అందజేస్తూ వార్షిక ప్లాన్‌ను తెచ్చింది.

good news for using reliance jio customers

రూ.3,227 కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ 365 రోజులు చెల్లుబాటవుతుంది. దీని ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ వెర్షన్‌కి యాక్సెస్‌ పొందవచ్చు. రోజుకు 2GB డేటా, 1 సంవత్సరానికి మొత్తం 730GB డేటా వస్తోంది. ఇతర ప్లాన్‌ల మాదిరిగానే అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు ఉంటాయి. JioCloud, JioTV, JioCinemaకి ఉచితంగా యాక్సెస్ పొందొచ్చు.

Sony Liv, Zee5, Disney+Hotstar సభ్యత్వంపై ఆసక్తి ఉన్నవారు వరుసగా రూ.3226, రూ.3225, రూ.3178 ప్లాన్‌లను తీసుకుంటే సరిపోతుంది. కొత్త ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్లాన్ ఇచ్చేటటువంటి ప్రయోజనాలను ఇవి కూడా అందిస్తాయి. Zee5, Sony Liv రెండింటి నుంచి OTT కంటెంట్‌ చూడాలనుకుంటే రూ.3662 ప్లాన్‌ తీసుకోవచ్చు. వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంది. రోజుకు 2.5GB డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు ఇస్తున్నారు.

అన్‌లిమిటెడ్‌ కాలింగ్, 5G డేటాతో పాటు 2GB రోజువారీ 4G డేటా కోటా, రోజుకు 100 SMS ఇస్తున్నారు. జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ యాక్సెస్‌తో పాటు ఈ ప్లాన్‌లో జీ5 సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. రూ.1,999 ప్లాన్ లో ఎలాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉండవు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, అన్‌లిమిటెడ్‌ 5జీ డేటాతో పాటు రోజుకు 4.5జీబీ 4జీ డేటా, 100 SMSలు ఇస్తున్నారు. జియో యాప్‌లు, సర్వీస్‌లకు ఉచితంగా యాక్సెస్‌ ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+