WhatsApp: వాట్సప్‍లో అదిరిపోయే ఫీచర్.. ఒక్కసారి మాత్రమే..!
వాట్సప్ వినియోగదారుల భద్రత, సౌకర్యం కోసం అనే ఫీచర్లు తీసుకోస్తోంది. తాజాగా వాట్సప్ లో మరో కొత్తి ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటీవల పాస్ వర్డ్ లెస్ పాస్ కీ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన మెటా సంస్థ.. తాజాగా వాట్సప్ లో వాయిస్ మేసేజ్ లకోసం View Once మోడ్ ను తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా ఒకసారి మాత్రమే వినగలిగే వాయిస్ మెసేజ్ పంపడానికి అవకాశం ఉంటుందట.
ఈ ఫీచర్ ప్రస్తుతం యాప్ బెటా వెర్షన్ ని వినియోగించే Android, iOS కస్టమర్లకోసం టెస్టింగ్ దశలో ఉందని మెటా పేర్కొంది. త్వరలో ఇది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. వాయిస్ నోట్స్ కోసం View Once మోడ్ ప్రారంభించాలంటే.. కస్టమర్లు రికార్డింగ్ సమయంలో వాయిస్ నోట్ వేవ్ ఫార్మ్ కి కుడివైపున కనిపించే 1 గుర్తును నొక్కాలి. ఈ మోడ్ ప్రారంభించిన వాయిస్ నోట్ పంపిన తర్వాత వాయిస్ పంపినవారు, రిసీవ్ చేసుకున్నవారు ఒకసారి మాత్రమే వినగలుగుతారని కంపెనీ తెలిపింది.

View Once భద్రత, నియంత్రణతో ఫీచర్ ద్వారా వాయిస్ నోట్ షేరింగ్ చేయొచ్చని పేర్కొంది. ఒకసారి View Once మోడ్ లో వాయిస్ మేసేజ్ పంపిస్తే.. దానిని డౌన్ లోడ్ చేయడం, ఫార్వార్డ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం కుదరదని స్పష్టం చేసింది. వాయిస్ మేజేస్ పంపించేవారు కూడా ఈ వాయిస్ నోట్ ను రికార్డు చేయలేరు, సేవ్ చేయలేరని పేర్కొంది. ఇది వాయిస్ మేసేజ్ పంపేవారికి ప్రైవసీ, కంటెంట్ పై నియంత్రణ ఉంటుందని మెటా తెలిపింది.
వాట్సప్ రెగ్యులర్ గా ఏదో ఒక ఫీచర్ ను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. కొద్ది రోజలు క్రితం వాట్స్ ఛానెల్ అనే ఆప్షన్ కూడా తీసుకొచ్చింది. అక్టోబర్ 24 నుంచి Whats App కొన్ని Android, iOS స్మార్ట్ ఫోన్లలో పనిచేయదని ఆ కంపెనీ తెలిపిన విషయం తెలిసిందే. Android OS 5.0 అంతకంటే తక్కువ ఉన్న Android స్మార్ట్ ఫోన్లలో ఇకపై WatsApp పనిచేయదని మెటా స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications