జియో సిమ్ కార్డు వాడేవారికి గుడ్ న్యూస్

రిలయన్స్ జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను(Jio Prepaid Plan) ప్రకటించింది. డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ కు మాత్రమే పరిమితమైన జియో ఇప్పుడు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను తెచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో జియో ఇప్పటికే పలు ప్లాన్లను ప్రవేశపెట్టింది. తాజాగా మరో రెండు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లతో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ తీసుకొచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీ, ఓటీటీ సదుపాయంతో ఈ ప్లాన్‌ ఉంది. .

కొత్త ప్లాన్ లో రూ.909తో రీఛార్జి చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2జీబీ డేటా పొందొచ్చు. మొత్తం 84 రోజులకు 168 జీబీ డేటాను వాడుకోవచ్చు. అలాగే ప్రతిరోజు ఉచితంగా 100 ఎస్ఎంఎస్ లు ఉపయోగించుకోవచ్చు. సోనీలివ్‌, జీ5 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ తోపాటు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌ యాక్సెస్‌ కూడా పొందొచ్చు. రోజుకు 2 జీబీ డేటా కోటా పూర్తయితే.. నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు పడిపోతుంది. హైస్పీడ్ డేటా కావాలనుకునేవారు డేటా యాడ్ ప్లాన్స్ రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది.

Reliance Jio launches new prepaid plans

నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రూ.1,099, రూ.1,499 రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.1,099 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే.. 84 రోజలు వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పొందొచ్చు. రూ.1,499 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 3జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు జియో యాప్స్‌ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ కూడా అందిస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ కావాలంటే రూ.3,227 తో రీఛార్జి చేసుకోవాలి. ఈ ప్లాన్ లో 730 జీబీ డేటాను పొందొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+