అలర్ట్: అక్టోబరు 24 నుంచి వాట్సాప్ పనిచేయదు?
ప్రస్తుతం అందరూ ఉపయోగించేది స్మార్ట్ ఫోన్సే. అందులో వాట్సాప్ లేకుండా ఎవరూ ఉండరు. స్నేహితుల దగ్గర నుంచి కుటుంబ సభ్యుల వరకు అందరూ వాట్సాప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని విశేషాలు పంచుకుంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది వినియోగదారులు వాట్సాప్ ను వాడుతున్నారు. అయితే కొందరు వినియోగదారులు మాత్రం త్వరలోనే వాట్సాప్ సేవలను ఉపయోగించుకోలేరు.
కొన్ని పాత ఫోన్ల(Old phones)లో వాట్సాప్ తన సర్వీసులను నిలిపివేయబోతోంది. అడ్వాన్స్‌డ్ ఫోన్లు, సాఫ్ట్‌వేర్‌లలోనే పని చేసే కొత్త ప్రైవసీ ఫీచర్లను వాట్సాప్ విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 4.1 లేదా అంతకంటే తక్కువ వెర్షన్ ఉన్న పాత ఫోన్లలో ఈ ఫీచర్లు పనిచేయవు. దీనివల్ల అవి ఉపయోగించేవారు వాట్సాప్ సేవలను కోల్పోనున్నారు. ఈనెల 24వతేదీ తర్వాత ఈ ఫోన్లకు సపోర్ట్ అందించడాన్ని సంస్థ నిలిపివేయనుంది. వినియోగదారులంతా కొత్త OSలకు అప్‌గ్రేడ్ కావాలని సంస్థ సూచించింది. గడువు తర్వాత వాట్సాప్ సపోర్ట్‌ను కోల్పోయే కొన్ని ఓల్డ్ ఫోన్స్ వివరాలు తెలుసుకుందాం.

శామ్‌సంగ్ గెలాక్సీ S2
2011లో శామ్‌సంగ్ నుంచి విడుదలైన ఫ్లాగ్‌షిప్ ఫోన్. 4.3-అంగుళాల స్క్రీన్, 8-మెగాపిక్సెల్ కెమెరా, డ్యూయల్-కోర్ ప్రాసెసర్ ఉంటాయి.
HTC వన్
2013లో విడుదలైంది. 4.7-అంగుళాల స్క్రీన్, 4-మెగాపిక్సెల్ కెమెరా, క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో ఉంది.
సోనీ ఎక్స్‌పీరియా Z
2013లో సోనీకి చెందిన వాటర్‌ప్రూఫ్ ఫోన్. 5 అంగుళాల స్క్రీన్, 13మెగాపిక్సెల్ కెమెరా, క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఉన్నాయి.
ఎల్‌జీ ఆప్టిమస్ G ప్రో
2013లో ఎల్‌జీ నుంచి వచ్చిన ఫాబ్లెట్ (పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్).
HTC సెన్సేషన్
2011లో విడుదలైంది. హై-ఎండ్ ఫోన్. ఇది కూడా వాట్సాప్ నుంచి సపోర్ట్‌ను కోల్పోతుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ S
2010లో శామ్‌సంగ్ విడుదల చేసింది. ఈ ఫోన్ వాడేవారు ఈనెల 24 తర్వాత కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావడం మంచిది.
HTC డిజైర్ HD
2010లో విడుదలైంది. 4.3-అంగుళాల స్క్రీన్, 8-మెగాపిక్సెల్ కెమెరా, సింగిల్-కోర్ ప్రాసెసర్‌తో వచ్చింది.
మోటారోలా Xoom
2011లో విడుదలైంది. ఇందులో 10.1-అంగుళాల స్క్రీన్, 5-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి.
శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 10.1
2011లో శామ్‌సంగ్ విడుదల చేసింది. దీంట్లో కూడా వాట్సాప్ పనిచేయదు.
నెక్సస్ 7
2012లో గూగుల్ విడుదల చేసిన నెక్సస్ ట్యాబ్లెట్ ఇది. ఇవన్నీ సెక్యూరిటీ అప్ డేట్లను పొందలేనప్పుడు డేటాతోపాటు ప్రైవసీకి హ్యాకర్ల నుంచి, అలాగే వైరస్ ల నుంచి ఎక్కువ హాని కలుగుతుంది.












Click it and Unblock the Notifications