Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రంగంలోకి 'ఏఐ' అవతార్స్.. అప్పు కట్టకుంటే ఇక అంతే..!

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగం నడుస్తోంది. ఏఐ టెక్నాలజీ అన్ని రంగాల్లోకి చొచ్చుకొచ్చింది. మానవుడు పరిష్కరించలేని అనేక సమస్యలు, సవాళ్లను ఏఐ ఛేదిస్తోంది. ఈ క్రమంలో ఏఐను వినియోగిస్తున్నవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. అటు భారత్ లోనూ ఏఐకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించారు. తాజాగా బ్యాంకులు కూడా ఏఐ సేవలను పొందుతున్నాయి. లోన్ రికవరీ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడుతున్నాయి బ్యాంకులు. ఈ మేరకు ఏఐ అవతార్స్ పేరిట అప్పు తీసుకున్న వారికి వీడియో కాల్స్, మెసేజ్ లు చేసేందుకు వీటిని వినియోగిస్తున్నారు. ఈ విధానం నచ్చడంతో పలు ప్రభుత్వ బ్యాంకులు కూడా ఈ విషయంపై సమీక్ష నిర్వహిస్తున్నాయి. ఉద్యోగుల నియామకం కంటే ఈ విధానం ఎంతో చీప్ అని పలు బ్యాంకులు భావిస్తున్నాయి.

దేశంలోని బ్యాంకులు లోన్ రికవరీ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై ఆధారపడుతున్నాయి. మనుషులకంటే ఏఐతోనే చీప్ గా పని జరుగుతుందని బ్యాంకులు భావిస్తున్నాయి. ఏఐ అవతార్స్ ను క్రియేట్ చేసి లోన్ తీసుకున్నవారికి వీడియో కాల్స్, మెసేజ్ లు చేసేందుకు వినియోగిస్తున్నారు. ఓవైపు ఆర్బీఐ నిబంధనలను పాటిస్తూనే మరోవైపు లోన్ రికవరీని వేగవంతం చేసేందుకు బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇవి లాయర్ల మాదిరి వ్యవహరిస్తాయి. బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నవారికి లోన్ రీ పేమెంట్ ను గుర్తు చేస్తాయి.

AI Debt Hunters Unleashed Banks Virtual Lawyers Chase Down Loan Defaulters in Terrifying Calls

లోన్ రికవరీ ఏజెంట్ నెలకు రూ. 30,000 సంపాదిస్తూ 250 కేసుల వరకూ డీల్ చేస్తుండగా ఏఐ అవతార్స్ మాత్రం ఏకంగా 20 టైమ్స్ అధికంగా డీల్స్ చేస్తున్నాయి. అలాగే వీటికి అయ్యే ఖర్చు కూడా 40 నుంచి 60 శాతం తక్కువ అని బ్యాంకులు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటివరకు పలు ప్రైవేట్ బ్యాంకులు ఈ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ విధానం ఇంకా అమల్లోకి రాలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+