100 ఏళ్లయినా ఏఐ ఆ పని చేయలేదు: బిల్‌గేట్స్ సంచలనం
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం భారీగా పెరిగిపోయింది. ఏఐ చాట్ బాట్స్ వచ్చేశాయి. ఏ ప్రశ్నకైనా క్షణాల్లో జవాబులు చెప్పేస్తున్నాయి. ఏఐ అన్ని రంగాల్లోకి వచ్చేసింది. మానవుడు పరిష్కరించలేని అనేక సమస్యల్ని, సవాళ్లను ఏఐ టక్కున పూర్తి చేస్తోంది.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులకు లే ఆఫ్ లు ప్రకటిస్తున్నారు. వీళ్ల స్థానంలో ఏఐను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో అనేక ఉద్యోగాలపై ఏఐ ప్రభావం భారీగా పడే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.

వచ్చే 100 ఏళ్లయినా ప్రోగ్రామర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) భర్తీ చేయలేదని అన్నారు. దీంతో పాటు కోడింగ్ పైనా ఏఐ ప్రభావం ఉండదని కోడింగ్ కు మానవుడి ఆలోచన, మేధస్సు అవసరం అని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ప్రోగ్రామింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుడిని అధిగమించలేదు. ప్రోగ్రామింగ్ లో క్లిష్టమైన సమస్యగా భావించేదాన్ని క్రియేటీవ్ గా పరిష్కరించాలి. మానవ మేధస్సు లేని ఏఐ అలా చేయలేద అని బిల్‌గేట్స్ అన్నారు. అలాగే కోడింగ్ అంటే కేవలం టైపింగ్ చేయడం కాదని.. చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంటుందని అన్నారు. ఈ మేరకు భవిష్యత్తులో కోడింగ్, ఎనర్జీ మేనేజ్‌మెంట్, బయాలజీ రంగాలకు ఆటోమేషన్ ముప్పు తక్కువేనని ఆయన అంచనా వేశారు.
From Grok:
— Robert Baker (@Rbaker923456) July 4, 2025
Bill Gates did indeed make statements along these lines, during an interview on The Tonight Show with Jimmy Fallon in February 2025. He discussed how advances in artificial intelligence (AI) over the next decade could lead to “free intelligence,” making expertise in…
మరోవైపు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. భారీగా లే ఆఫ్ లు ఇచ్చి ఏఐ వినియోగం చేయడం వల్ల.. ఏఐతో గత ఏడాది రూ.4వేల కోట్లు ఆదా అయినట్లు పేర్కొంది. ఇటీవల భారీ సంఖ్యలో లేఆఫ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications