ఫోన్ మాట్లాడే తీరిక లేదా? మీ కోసం దేశంలోనే తొలి ఏఐ కాల్ అసిస్టెంట్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. ప్రస్తుతం ఏ రంగంలో చూసిన ఏఐ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు వచ్చే ఫోన్ కాల్స్ కు కూడా ఆటోమేటిగ్గా రిప్లై ఇస్తుంది. ఏఐ లో కొత్త కొత్త అప్డేట్స్ రోజు రోజుకి వస్తున్న క్రమంలో తాజాగా ఏఐ కాల్ అసిస్టెంట్ అనే ఒక కొత్త ఏఐ టూల్ వచ్చింది.
దేశంలోని తొలి ఏఐ కాల్ అసిస్టెంట్
గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కి సమాధానం ఇవ్వడానికి దేశంలోని తొలి ఏఐ కాల్ అసిస్టెంట్ పనిచేస్తుందని దీనిని రూపొందించిన హైదరాబాద్ అంకురసంస్థ ఈక్వల్ వ్యవస్థాపకుడు పారిశ్రామిక దిగ్గజం జీవీకే వారసుడు కేశవరెడ్డి వెల్లడించారు. ప్రతిరోజు గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ తో విసిగి వేసారిన వారు ఇక నుంచి ఆ ఇబ్బంది లేకుండా కాల్ అసిస్టెంట్ ఏఐ అభివృద్ధి చేసినట్టు తెలిపారు.

రేపటి నుండి ఢిల్లీ ఎన్సీఆర్ లో అందుబాటులో
ఈక్వల్ ఏఐ అక్టోబర్ 2 నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ లో అందుబాటులోకి వస్తుందని దశలవారీగా దేశవ్యాప్తంగా ప్రవేశపెడతామని ఆయన వెల్లడించారు. 2026 మధ్య నాటికి రోజుకు 10లక్షల ఆక్టివ్ యూజర్లను లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. ఇక ఈ ఏఐ కాల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, హిందీ భాషలలో సమాధానం ఇవ్వగలదని, గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ మాత్రమే కాకుండా, టెలి మార్కెటింగ్, డెలివరీ ఏజెంట్ల కాల్స్ కు కూడా ఇది సమాధానం ఇస్తుందన్నారు.
వినియోగదారుడికి బదులుగా కాల్ మాట్లాడే ఏఐ అసిస్టెంట్
ఒకవేళ వినియోగదారుడు ఆ కాల్స్ ను నేరుగా మాట్లాడాలి అనుకుంటే మధ్యలోనైనా ఏఐ కాల్ అసిస్టెంట్ నుంచి తీసుకుని ముందుగా ఢిల్లీలోని పదివేల మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందిస్తామని సంస్థ వ్యవస్థాపకుడు తెలిపారు. ఈక్వల్ ఏఐ వినియోగదారుల తరఫున ముందు కాల్ ను స్వీకరించి కాలర్ ను, కాల్ అవసరాన్ని గుర్తించడానికి ముందుగా మాట్లాడుతుంది.
స్పామ్ కాల్స్ తో టైం వేస్ట్ కాకుండా గొప్ప ఆవిష్కరణ
ఆ పైన కాల్ మనకు కనెక్ట్ చేయడం లేదా సందేశాన్ని నోట్ చేసుకోవడం లాంటి పనులు చేస్తుంది. వినియోగదారుడు అవసరమనుకుంటే కాల్ మాట్లాడవచ్చు లేదంటే ఇగ్నోర్ చేయవచ్చు. మిగతా పనంతా ఏఐ కాల్ అసిస్టెంట్ చూసుకుంటుంది. ఏది ఏమైనా స్పామ్ కాల్స్ తో టైం వేస్ట్ కాకుండా ఉండేందుకు, చాలా బిజీగా ఉన్న సమయంలో ముఖ్యమైన కాల్స్ మిస్ కాకుండా ఉండేందుకు ఈ ఏఐ కాల్ అసిస్టెంట్ టూల్ ఉపయోగపడుతుంది.
ఏఐ కాల్ అసిస్టెంట్ ఇప్పుడు అవసరం
ప్రస్తుతం మన దేశంలో సుమారు 60 శాతం మంది మొబైల్ యూజర్లు ప్రతిరోజు నాలుగైదు స్పామ్ కాల్స్ తో ఇబ్బంది పడుతున్నారు. దీనిని అరికట్టడం కోసం తయారు చేసిన ఏఐ కాల్ అసిస్టెంట్ పనిచేస్తుంది. మొత్తంగా ఇకపై పనికిమాలిన కాల్స్ ను లిఫ్ట్ చేసి ఇబ్బంది పడే పరిస్థితి నుండి ఈ ఏఐ కాల్ అసిస్టెంట్ బయటపడేస్తుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications