ఏ రాశిలో పుట్టాడో గానీ 853 బిలియన్ డాలర్ల శ్రీమంతుడు: ఆ ముగ్గురి ఆస్తి మొత్తం కలిపినా సాటి రాదు..!!
అపర కుబేరుడు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరో హిస్టరీని క్రియేట్ చేశారు. ఆయన ఆస్తులు లెక్కపెట్టలేనంతగా పెరిగాయి. నికర విలువ 852.50 బిలియన్ డాలర్లకు చేరింది. 850 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తులను సంపాదించిన ఏకైక మొనగాడు ఎలాన్ మస్క్. ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా ఈ ల్యాండ్ మార్క్ ను అధిగమించలేదు. తొలిసారిగా దీన్ని అందుకున్న ఘనతను సాధించాడు మస్క్.
దీనికి కారణాలు లేకపోలేదు. మస్క్ కు చెందిన 1.25 ట్రిలియన్ డాలర్ల విలువ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ.. స్పేస్‌ఎక్స్- టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ఎక్స్ కు చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డివిజన్ ఎక్స్ ఏఐ విలీనం కావడమే. ఈ రెండూ కూడా ఎలాన్ మస్క్ కు చెందినవే. ఈరెండు సంస్థల మెగా విలీనంతో ఆయన నికర ఆస్తుల విలువ ఒక్కసారిగా రాకెట్ లా పైకి ఎగిసింది. 852.50 బిలియన్ డాలర్లకు చేరింది.

ఫోర్బ్స్ లైవ్ బిలియనీర్ ట్రాకర్ ఈ వివరాలను వెల్లడించింది. స్పేస్‌ఎక్స్‌లో ఎక్స్‌ఏఐ విలీనం తర్వాత మస్క్ నికర విలువ భారీగా పెరిగిందని, ఆయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారని తెలిపింది. ఈ భారీ సామ్రాజ్యంలో మస్క్‌కు 42 శాతం వాటా ఉంది. స్టార్‌షిప్ ప్రయోగాలు, గ్రోక్ ఏఐ, ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్.. ఇకపై ఒకే గొడుగు కింద పని చేస్తాయి.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు.. లారీ పేజ్, సెర్గీ బ్రిన్, జెఫ్ బెజోస్. ఈ ముగ్గురి సంయుక్త నికర ఆస్తులను కలిపితే మొత్తం 783 బిలియన్ డాలర్లు అవుతాయి. ఈ మొత్తం కంటే కూడా ఎలాన్ మస్క్ ఒక్కడి ఆస్తుల విలువ దీన్ని అధిగమించిందని ఫోర్బ్స్ నివేదించింది. మస్క్ సంపద వీరి ముగ్గురి మొత్తం సంపాదన కంటే 69.5 బిలియన్ డాలర్లు ఎక్కువ.
మస్క్ వ్యాపార ప్రస్థానం 1995లో జిప్ 2తో ప్రారంభమైంది. మీడియా కంపెనీలు, స్థానిక ఈ-కామర్స్ వ్యాపారులకు డైరెక్టరీలు, మ్యాప్‌లు అందించిన ఈ సంస్థను 340 మిలియన్ డాలర్లకు కంపాక్ కొనుగోలు చేసింది. దీని తర్వాత ఇక మస్క్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన ఎక్స్ డాట్ కామ్‌ను స్థాపించారు. అది పేపాల్‌తో విలీనమైంది. దీన్ని ఈబేకు 1.5 బిలియన్లకు విక్రయించగా.. మస్క్‌కు 165 మిలియన్ డాలర్లు లభించాయి. ఈ నిధులతోనే మస్క్ టెస్లా, స్పేస్‌ఎక్స్‌లను స్థాపించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications