ఏఐ మహిమ.. ఆదాయంలో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టిన గూగుల్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ప్రపంచమే దీని మీద నడుస్తుంది. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి గూగుల్ చరిత్ర సృష్టించింది. ఇక చరిత్రలోనే తొలిసారిగా గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 100 బిలియన్ డాలర్ల త్రైమాసిక ఆదాయాన్ని సాధించి సరికొత్త రికార్డును నమోదు చేసింది.

గూగుల్ ఆల్ టైం రికార్డ్
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఈ త్రైమాసికంలో సంపాదించిన ఆదాయం మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 8. 80 లక్షల కోట్ల రూపాయలు. సెర్చ్, క్లౌడ్, యూట్యూబ్ వంటి కీలక విభాగాలలో బలమైన రెండంకెల వృద్ధిని సాధించడం వల్లనే ఇది సాధ్యమైందని ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు.2025 మూడవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్.

Google breaks all-time record in income in this q3 results with AI

Take a Poll

క్వార్టర్లీ రిజల్ట్స్ పై సుందర్ పిచాయ్
ఈ సందర్భంగా మాట్లాడిన ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ జెమినీ యాప్ కు నెలవారి యాక్టివ్ యూజర్లు 650 మిలియన్లు దాటారని, గత త్రైమాసికంతో పోలిస్తే ఏఐ జెమినీకి వచ్చే ప్రశ్నలు మూడు రెట్లు పెరిగాయని తెలిపారు. కంపెనీ వృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన వెల్లడించారు. క్లౌడ్ విభాగం కూడా అద్భుతమైన పనితీరును కనబరిచిందని పేర్కొన్న ఆయన, దీనికి ఏఐ ఆధారిత ఆదాయం కీలకమంటూ వెల్లడించారు.

ఏఐ తోనే గూగుల్ ఆల్ఫాబెట్ ఆదాయ వృద్ధి
క్లౌడ్ బ్యాక్ లాగ్ 46శాతం పెరిగి 150బిలియన్ డాలర్లకు చేరుకుందని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. అంతేకాదు గూగుల్ వన్, యూట్యూబ్ ప్రీమియం వంటి సబ్స్క్రిప్షన్ లు కూడా 300 మిలియన్ల మార్కును అధిగమించాయని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 40భాషలలో అందుబాటులో ఉన్న ఏఐ మోడ్ కు రోజువారి 75 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారని, ఇది సెర్చ్, ప్రశ్నల పెరుగుదలకు దోహదం చేస్తుందని సుందర్ పిచాయ్ తెలిపారు.

గూగుల్ సర్వీసెస్ ఆదాయం 14 శాతం వృద్ధి
ఈ త్రైమాసికంలో గూగుల్ సర్వీసెస్ ఆదాయం 14 శాతం వృద్ధితో 87 బిలియన్ డాలర్లకు చేరిందని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ వెల్లడించారు. యూట్యూబ్ ప్రకటనల ఆదాయం 15% వృద్ధి చెందిందని, సెర్చ్ ఆదాయం 15% వృద్ధి చెందిందని పేర్కొన్నారు .

ఆదాయ ఆర్జనకు కొత్త అవకాశాలు పెంచిన ఏఐ
ఏఐ ఓవర్ వ్యూస్, ఏఐ మోడ్ వంటి కొత్త ఫీచర్ల పైన పెట్టుబడులు ఆదాయాన్ని అర్థించడానికి కొత్త అవకాశాలను పెంచాయని ఆయన అన్నారు. ఈసారి రిటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు google ఆదాయం పెరగడానికి ముఖ్య భూమిక పోషించాయని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+