AI: ఏఐలో ఈ కోర్సులు చేస్తే.. లక్షల్లో జీతాలు..!!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచ గమనాన్నే మార్చేస్తోంది. అన్ని రంగాల్లోనూ ఇప్పుడు ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కీలక రంగాలకు విస్తరించింది. భవిష్యత్ మొత్తం ఏఐ తోనే ముడి పడి ఉందనే సంకేతాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఏఐ విప్లవం ఉపాధి కల్పన పైన ప్రభావం చూపుతోంది. దీంతో.. ఏఐ కోర్సులకు డిమాండ్ ఏర్పడుతోంది. పేరున్న సంస్థలు సైతం భవిష్యత్ లో ఏఐ కోర్సుల ద్వారా లక్షల్లో వేతనాలు ఖాయమని చెబుతున్నాయి. అలాంటి ప్రధానమైన అయిదు కోర్సులకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా
ప్రపంచం మొత్తం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వెంట పరుగులు తీస్తోంది. ఇప్పటికే దాదాపుగా అన్ని కీలక రంగాలకు ఏఐ వ్యాపించింది. ప్రధానమైన విద్య.. వైద్యం.. వ్యాపార రంగాల్లో ఏఐ ఇప్పటికే ప్రభావం చూపుతోంది. ఏఐకి భవిష్యత్ లో మరింత డిమాండ్ ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఏఐ ఆధారిత సేవలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ప్రస్తుతం ఏఐ కోర్సుల వైపు ఆసక్తి పెరుగుతోంది. దీంతో.. ఏఐ రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్న అయిదు కోర్సు లకు ఉందని నిపుణులు చెబుతున్నారు. అందులో ప్రధానంగా మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్లకు ఇప్పటికే మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది.

పెరుగుతున్న డిమాండ్
వేగంగా విస్తరిస్తున్న ఆటోమెటిక్ వాహనాలు, ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్స్ రంగాల్లో వీరి పాత్ర కీల కంగా మారుతోంది. దీనికి అనుగుణంగా భారీ వేతనాలు ఆఫర్ చేస్తున్నారు. అదే విధంగా రొబోటిక్ ఇంజర్ కోర్సుకు డిమాండ్ ఉంది. ఈ కోర్సు చేసిన వారు స్వయం ప్రతిపత్తితో పని చేసే విధంగా ఇంటెలిజెంట్ మిషన్లను రూపొందించటం ప్రధాన విధి. వీరికి మండి డిమాండ్ కనిపిస్తోంది. వీటితో పాటుగా డేటా సైంటిస్ట్ ఉద్యోగా లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగాలు కావటంతో మార్కెటింగ్ తో పాటుగా సేవా రంగాల్లో వీరికి డిమాండ్ ఉంది. దీనికి తగిన విధంగానే వేతనాలు ఉన్నాయి.
ఆకట్టుకునే వేతనాలు
ఇక, ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ కోర్సుకు ఉన్న ప్రత్యేకత వేరు. అకడమిక్ సెట్టింగ్ తో పాటుగా కొత్త మోడల్స్ ను డెవలప్ చేసే వీరికి మంచి వేతనాలు అందుతున్నాయి. అదే సమయంలో ఏఐ ప్రొడక్ట్ మేనేజర్లు ప్రస్తుత వ్యాపార రంగంలో కీలకంగా మారారు. ఏఐ ఆధారిత ఉత్పత్తులను మార్కెట్ కు అనుగుణంగా ఉంచటంలో వీరికి ప్రధాన పాత్ర. దీంతో, వీరికి ఆకట్టుకునే వేతనాలు ఉన్నాయి. కాగా, మారుతున్న కాలానికి అనుగుణంగా వీటిల్లోనూ మార్పులు ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications