యోగా కోసం AI యాప్ - ఇంటి దగ్గరే ప్రాక్టీస్...!!

ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్. మొత్తం ప్రపంచాన్నే శాశిస్తోంది. కీలక రంగాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఏఐ నైపుణ్యం ఉన్న వారికి భారీ వేతనాలతో ఎంఎన్సీలు ఆఫర్లు ఇస్తున్నాయి. ఏఐ ద్వారా కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఇదే ఏఐ ఎటువంటి ట్రైనర్ అవసరం లేకుండానే యోగాసనాలు సాధనకు ఉపయోగ పడుతుంది. దీని ద్వారా ఇంటి వద్ద నుంచే యోగా చేసుకునే వెసులుబాటు కలుగుతోంది. ఏ ఆసనం ఎంత సేపు వేయాలి.. మన ఆసన తీరు సరిగ్గా ఉందా లేదా అనేది పూర్తిగా అప్రమత్తం చేస్తోంది. దీంతో, ఇప్పుడు ఈ యాప్ కు డిమాండ్ పెరుగుతోంది.

సహజంగా యోగా కొత్తగా నేర్చుకునే వారు శిక్షకుడి వద్ద సాధన చేయాలి. అయితే, ఇప్పుడు ఏఐ ద్వారా వచ్చిన యాప్ తో ఇంటి వద్దే యోగా చేసుకునే అవకాశం కలిగింది. కర్నూలులోని ట్రిపుల్​ ఐటీ డీఎం విద్యార్థులు, ప్రొఫెసర్లు ఏఐ ఆధారంగా పనిచేసే యోగా యాప్‌ను అభివృద్ధి చేశారు. ఫోన్‌లో ఆ యాప్‌ను తెరిచి దానిముందు యోగాసనాలు వేస్తే, మనం సరిగ్గా ప్రాక్టీస్ చేస్తున్నామో లేదో విశ్లేషిస్తుంది. ఆసనం కచ్చితంగా వచ్చేవరకూ మనకు సలహాలు ఇస్తూ ఉంటుంది. ఈ యాప్‌ ఉంటే యోగా ట్రైనర్ మన దగ్గర ఉన్నట్లేనన్న భావన కల్పించేలా దీనిని రూపొందించారు. ఈ యాప్ లో తొలుత సూర్య నమస్కారాలు సాధన చేసేలా పొందు పర్చారు. మిగిలిన యోగాసనాల న్నింటినీ దశలవారీగా యాప్ లో చేర్చుతున్నారు.

iiitdm-kurnool-unveils-ai-powered-yoga-app-a-virtual-yoga-master

ప్రస్తుతానికి ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ https://yogandhra.ap.gov.in లో మాత్రమే అందు బాటులో ఉంచారు. త్వరలోనే ఇది యాప్​గానూ ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ యాప్​ ద్వారా ప్రస్తుతం యోగా ప్రాక్టీస్ చేయాలనుకునే వారు ప్రభుత్వ అధికారిక యోగాంధ్ర వెబ్ సైట్ https://yogandhra.ap.gov.in లోకి వెళ్లాలి. అక్కడ హోమ్ పేజీలో ఏఐ బేస్డ్​ యోగా యాప్ అని కనిపిస్తుంటుంది. దానిపై క్లిక్ చేసి, పేరు, ఫోన్​ నెంబర్​తో లాగిన్ అవ్వాలి. తరువాత అక్కడ స్టార్ట్​ యువర్ సెషన్​పై క్లిక్ చేసి యోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రారంభం నుంచి ఈ యాప్ కు మంచి డిమాండ్ పెరుగుతోంది. ఆధునిక జీవన శైలిలో యోగాకు పెరుగుతున్న ప్రాధాన్యత వేళ ఈ యాప్ మరింతగా ఉపయోగ కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+