AI: చెదిరిపోతున్న భారత్ ఏఐ కల? అమెరికాకు 100 సంస్థల క్యూ..!

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ (AI) దూకుడు కొనసాగుతున్న వేళ దాన్ని ఒడిసి పట్టుకునేందుకు ఇతర దేశాలతో పాటు భారత్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఏఐకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. విద్యార్ధులు సైతం ఏఐ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో భారత్ కు ఓ చేదువార్త అందింది. భారత్ లో ప్రారంభించిన 100కు పైగా ఏఐ స్టార్టప్ లు అమెరికాకు తరలిపోతున్నాయి.

ఇలా భారత్ లో ఏర్పాటైన ఏఐ స్టార్టప్ సంస్థలు అమెరికాకు క్యూ కట్టడానికి, అదీ అక్కడ వలసలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నా, దాన్ని తట్టుకుని మరీ అక్కడికి వెళ్లేందుకు ఎందుకు సిద్దమవుతున్నాయనే దానికి పలు కీలక కారణాలు కనిపిస్తున్నాయి. భారత్ లో 100 మందికి పైగా భారతీయ ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకులు.. కస్టమర్లు, మూలధనం అధునాతన ఏఐ పర్యావరణ వ్యవస్థలను మెరుగ్గా యాక్సెస్ చేయడానికి అమెరికాకు మకాం మార్చారు లేదా వెళ్లాలని యోచిస్తున్నట్లు తేలింది.

Indian AI Exodus Over 100 Founders Relocate to the US for Better Funding amp amp Talent

ట్రంప్ హయాంలో అమెరికా వలస సవాళ్లు, భారతదేశం నుండి రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ చర్చలు ఉన్నప్పటికీ ఈ ధోరణి మాత్రం ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. అయితే ఇలా భారత్ ను వీడి అమెరికాకు వలసపోవడం వెనుక ఏఐ వ్యవస్థాపకులు తాము వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, వృద్ధి వేగం, అక్కడి ఎంటర్‌ప్రైజ్ కస్టమర్‌లకు, ముఖ్యంగా శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా ఏఐ హబ్‌కు దగ్గరగా ఉండటం వంటి కారణాలను చెప్తున్నారు. భారత్ తో పోలిస్తే అమెరికా సంస్థలు బలంగా ఏఐని అమలు చేస్తుండటం, భారీ చెల్లింపులకు వెనుకాడకపోవడం వంటి కారణాలతో నిధుల సేకరణ, నియామకాలు కూడా వేగంగా చేపడుతున్నారు.

Indian AI Exodus Over 100 Founders Relocate to the US for Better Funding amp amp Talent

ఇలా గత రెండేళ్లలో అమెరికాకు మకాం మార్చేసిన కంపెనీల్లో కంపోజియో (Composio), మీట్ స్ట్రీమ్.ఏఐ (Meetstream.ai)స్మాలెస్ట్. ఏఐ (Smallest.ai), బీట్ ఓవెన్.ఏఐ ( Beatoven.ai) గెట్ క్రక్స్ (GetCrux) వంటి సక్సెస్ ఫుల్ సంస్థలున్నాయి. ఆంట్లర్ ఇండియా, అప్‌స్పార్క్స్ క్యాపిటల్, బ్లూమ్ వెంచర్స్, ఎలివేషన్ క్యాపిటల్ ,నియాన్ ఫండ్ వంటి పెట్టుబడిదారులు 10-20 మంది పోర్ట్‌ఫోలియో వ్యవస్థాపకులు లీన్ టీమ్స్, ఏఐ వేవ్ లీవరేజ్ కోసం శాన్ ఫ్రాన్సిస్కోకు వీరు మారుతున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+