బజాజ్ తో చేతులు కలిపిన బెజోస్.. 6.2 బిలియన్ డాలర్లతో బిగ్ ప్రాజెక్ట్

ప్రముఖ ఇ- కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్ బెజోస్ సంచలనాలకు తెర తీశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగలో అడుగు పెట్టారు. కొత్త AI స్టార్టప్ ను ప్రారంభించారు. దీని పేరు 'ప్రాజెక్ట్ ప్రోమెథియస్'. దీని పెట్టుబడి.. ఏకంగా 6.2 బిలియన్ డాలర్లు. దీనికి ఆయన కో- సీఈఓగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం అమెజాన్ కు సీఈఓగా ఉన్న ఆయనకు ఇదో కొత్త రోల్ అవుతుంది.

ప్రాజెక్ట్ ప్రోమెథియస్ కు సంబంధించిన ఖచ్చితమైన ప్రణాళికలు, ప్రొడక్ట్ ఏమిటనేది ఇంకా వెల్లడి కాలేదు. ప్రత్యేకించి- కంప్యూటింగ్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్ వంటి రంగాల్లో మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మరింత మెరుగుపరడం, వేగవంతం చేయడంపై ఈ స్టార్టప్ దృష్టి సారించనుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి అవసరమైన 6.2 బిలియన్ డాలర్లను ఫండింగ్ ద్వారా సమీకరించుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఓ ప్రత్యేక కథనాన్ని ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.

Jeff Bezos Unveils New AI Startup Project Prometheus as Co-CEO with Vik Bajaj

ప్రాజెక్ట్ ప్రోమెథియస్ కోసం 6.2 బిలియన్ డాలర్లను సమీకరించడం ఓ రికార్డు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏ స్టార్టప్ కోసం, ఎవ్వరు కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చుకోలేదని న్యూయార్క్ టైమ్స్ వివరించింది. అత్యధిక నిధులు పొందిన స్టార్టప్‌ల్లో ఇది టాప్ లో ఉందని పేర్కొంది. ఇందులో జెఫ్ బెజోస్ వాటా కూడా ఉంది. సంస్థకు నిధులు సమకూర్చడంతో పాటు, సహ-వ్యవస్థాపకుడిగా వ్యవహరించనున్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్ కోసం భారతీయుడైన విక్ బజాజ్‌తో జెఫ్ బెజోస్ చేతులు కలపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బెజోస్ తో కలిసి మరో సీఈఓగా బాధ్యతలను చేపట్టనున్నారు విక్ బజాజ్. విక్ బజాజ్.. సైంటిస్ట్. ఫిజిక్స్, కెమిస్ట్రీపై ఆయనకు మంచి పట్టు ఉంది. గతంలో X అనే సంస్థలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. ఇది గూగుల్ కు చెందిన మూన్‌షాట్ ఫ్యాక్టరీ. ఆ తర్వాత ఆల్ఫాబెట్‌కు చెందిన వెరిలీ అనే హెల్త్ టెక్ కంపెనీకి నాయకత్వం వహించారు.

ప్రాజెక్ట్ ప్రోమెథియస్‌లో ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో OpenAI, డీప్‌మైండ్, మెటా నుండి వచ్చిన మాజీ ఉద్యోగులు కూడా ఉన్నారు. బెజోస్ ఇప్పుడు ఈ టీమ్ లో చేరారు. 2021లో అమెజాన్ సీఈఓ హోదా నుంచి తప్పుకున్న తర్వాత బెజోస్ కు ఇది మొదటి క్రియాశీలక పాత్ర అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+