ఏఐ దెబ్బకు పోయే 40 ఉద్యోగాలు, తట్టుకునే 40 ఉద్యోగాలు-మైక్రోసాఫ్ట్ రిపోర్ట్..!
కృత్రిమ మేథ (ఏఐ) దూకుడు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు వేగంగా ఆవిరైపోతున్నాయి. చిన్నా చితకా సంస్దల నుంచి ప్రపంచ ప్రఖ్యాత సంస్ధలు సైతం ఏఐ టూల్స్ ను తీసుకొచ్చి ఉద్యోగుల్ని తగ్గించుకునే పనిలో బిజీగా ఉన్నాయి. దీంతో ప్రతీ ఉద్యోగీ తన ఉద్యోగం సేఫా కాదా అన్న ఆందోళనలోనే కనిపిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏఐ ప్రభావంపై తాను చేపట్టిన అధ్యయన నివేదికను తాజాగా బయటపెట్టింది.
మైక్రో సాఫ్ట్ అధ్యయనం ప్రకారం 40 ఉద్యోగాలు ప్రస్తుతం కృత్రిమ మేథ కారణంగా తొలగింపు ముప్పు ఎదుర్కొంటున్నట్లు తేలింది. అలాగే ఏఐ ప్రభావాన్ని తట్టుకుని నిలబడే మరో 40 ఉద్యోగాల వివరాల్ని కూడా మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ అంచనా ప్రకారం ఏఐ కారణంగా ఇంటర్‌ప్రెటర్లు, ట్రాన్స్‌లేటర్లు, చరిత్రకారులు, ప్యాసింజర్ అటెండెంట్లు, సేల్స్ రిప్రజెంటేటివ్స్, రచయితలు, కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు, సీఎన్సీ టూల్ ప్రోగ్రామర్లు, టెలిఫోన్ ఆపరేటర్లు, టికెట్ ఏజెంట్లు, ట్రావెల్ క్లర్క్‌లు, బ్రాడ్‌కాస్ట్ అనౌన్సర్లు. రేడియో డీజేలు, బ్రోకరేజ్ క్లర్క్‌లు, ఫార్మ్ , హోమ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేటర్లు, టెలిమార్కెటర్లు, కన్సీర్జెస్, రాజకీయ శాస్త్రవేత్తలు ఉన్నారు.

అలాగే ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పేయే వారిలో వార్తల విశ్లేషకులు, రిపోర్టర్లు, జర్నలిస్టులు, 17. గణిత శాస్త్రవేత్తలు,సాంకేతిక రచయితలు, ప్రూఫ్ రీడర్లు, కాపీ మార్కర్లు, హోస్ట్‌లు, హోస్టెస్‌లు, ఎడిటర్లు, వ్యాపార ఉపాధ్యాయులు, పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్ట్‌లు, డెమోన్‌స్ట్రేటర్లు, ఉత్పత్తి ప్రమోటర్లు, ప్రకటనల అమ్మకాల ఏజెంట్లు, కొత్త ఖాతాల క్లర్కులు, గణాంక సహాయకులు, కౌంటర్-అద్దె క్లర్కులు, డేటా సైంటిస్టులు, వ్యక్తిగత ఆర్థిక సలహాదారులు, ఆర్కైవిస్టులు, ఆర్థిక శాస్త్ర ఉపాధ్యాయులు, వెబ్ డెవలపర్లు, మేనేజ్మెంట్ విశ్లేషకులు, భౌగోళిక శాస్త్రవేత్తలు, మార్కెట్ పరిశోధన విశ్లేషకులు, ప్రజా భద్రత టెలికమ్యూనికేటర్లు, స్విచ్‌బోర్డ్ ఆపరేటర్లు, లైబ్రరీ సైన్స్ టీచర్లు కూడా ఉన్నారు.
మరోవైపు ఏఐ ముప్పు లేని ఉద్యోగాల్లో ఫ్లెబోటోమిస్టులు, నర్సింగ్ అసిస్టెంట్లు, ప్రమాదకర పదార్థాల తొలగింపు కార్మికులు, సహాయకులు-పెయింటర్లు, ప్లాస్టర్లు,ఎంబాల్మర్లు, ప్లాంట్ , సిస్టమ్ ఆపరేటర్లు, ఇతర ఓరల్ , మాక్సిల్లోఫేషియల్ సర్జన్లు, ఆటోమోటివ్ గ్లాస్ ఇన్‌స్టాలర్లు మరియు రిపేర్లు, షిప్ ఇంజనీర్లు, టైర్ రిపేర్లు, ఛేంజర్లు, స్టోడాంటిస్టులు, హెల్పర్లు-ప్రొడక్షన్ వర్కర్లు, హైవే మెయింటెనెన్స్ వర్కర్లు, మెడికల్ ఎక్విప్‌మెంట్ ప్రిపేర్లు, ప్యాకేజింగ్, ఫిల్లింగ్ మెషిన్ ఆపరేటర్లు, మెషిన్ ఫీడర్లు మరియు ఆఫ్‌బేరర్లు, డిష్‌వాషర్లు, సిమెంట్ మేసన్లు, కాంక్రీట్ ఫినిషర్లు ఉన్నారు.

అలాగే అగ్నిమాపక సిబ్బంది సూపర్‌వైజర్లు, ఇండస్ట్రియల్ ట్రక్, ట్రాక్టర్ ఆపరేటర్లు, ఆప్తాల్మిక్ మెడికల్ టెక్నీషియన్లు, మసాజ్ థెరపిస్టులు, సర్జికల్ అసిస్టెంట్లు, టైర్ బిల్డర్లు, హెల్పర్లు-రూఫర్లు, గ్యాస్ కంప్రెసర్ మరియు గ్యాస్ పంపింగ్ స్టేషన్ ఆపరేటర్లు, రూఫర్లు, రౌస్టాబౌట్‌లు, ఆయిల్, గ్యాస్ మెయిడ్స్, హౌస్ కీపింగ్ క్లీనర్లు, పేవింగ్, సర్ఫేసింగ్ మరియు ట్యాంపింగ్ ఎక్విప్‌మెంట్ ఆపరేటర్లు, లాగింగ్ పరికరాలు ఆపరేటర్లు, మోటార్ బోట్ ఆపరేటర్లు, ఆర్డర్లీలు, ఫ్లోర్ సాండర్స్ మరియు ఫినిషర్లు, పైల్ డ్రైవర్ ఆపరేటర్లు, రైల్-ట్రాక్ లేయింగ్, మేనేజ్మెంట్ పరికరాల ఆపరేటర్లు, ఫౌండ్రీ మోల్డ్ , కోర్ మేకర్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు సిస్టమ్ ఆపరేటర్లు, బ్రిడ్జ్ మరియు లాక్ టెండర్లు, డ్రెడ్జ్ ఆపరేటర్లు కూడా సేఫ్ గా ఉన్నారు.












Click it and Unblock the Notifications