ద్యావుడా.. గూగుల్ క్రోమ్ నే కొంటాడట: సుందర్ పిచాయ్ కు భారీ ఆఫర్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది.. పెర్‌ప్లెక్సిటీ ఏఐ. సరికొత్త సంచలనాలకు తెర తీసింది. రోజుకో అద్భుతాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే వెబ్ బ్రౌజర్ కామెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందీ ఏఐ స్టార్టప్ కంపెనీ. ఇప్పుడు మరో మైలురాయికి చేరువగా నిలిచింది.
గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం గూగుల్ యాజమాన్యం ఆల్ఫాబెట్ ముందు కళ్లు చెదిరే ఆఫర్ పెట్టింది. 34.5 బిలియన్ డాలర్ల ఆఫర్‌ను ఇచ్చింది. ఈ సంవత్సరం ఆ స్టార్టప్ కంపెనీ ఆఫర్ చేసిన రెండో అతి పెద్ద డీల్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిందీ కంపెనీ.

పెర్‌ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్. ఈ సంస్థ మొత్తం మార్కెట్ విలువ 18 బిలియన్ డాలర్లు. ఈ డీల్ కు ఆల్ఫాబెట్ అంగీకరిస్తే.. 18 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులు అవసరమవుతాయి. ఈ అదనపు నిధులను ఎలా సమకూర్చుకోవాలనేది పెర్‌ప్లెక్సిటీ ఇంకా వెల్లడించలేదు. సాఫ్ట్‌బ్యాంక్, ఎన్ విడియా వంటి పెట్టుబడిదారుల నుండి ఇప్పటికే ఒక బిలియన్ డాలర్ల నిధులు సేకరించింది.
రాయిటర్స్ ప్రచురించిన కథనం ప్రకారం.. ఫండ్స్ రూపంలో కూడా అమ్మకం మొత్తాన్ని స్వీకరించడానికి ఆల్ఫాబెట్ అంగీకరిస్తే డీల్‌కు పూర్తిగా నిధులు సమకూర్చడానికి సిద్ధంగా పెర్‌ప్లెక్సిటీ సిద్ధంగా ఉంది. గూగుల్ క్రోమ్ ను కొనుగోలు చేస్తే పెర్‌ప్లెక్సిటీకి మూడు బిలియన్ల మంది యూజర్లు ఇప్పటికిప్పుడు లభించినట్టవుతుంది.
ఆల్ఫాబెట్ ఉద్దేశం మరోలా ఉంది. గూగుల్ క్రోమ్‌ను విక్రయించడానికి సిద్ధంగా లేదు. ఆన్‌లైన్ సెర్చింగ్ మార్కెట్‌లో గూగుల్ క్రోమ్ దే ఆధిపత్యం. ఇటీవలే యూఎస్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు కొంత వెనకడుగు వేసేలా చేస్తోందా సంస్థను. అక్రమ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందంటూ ఇదివరకు యూఎస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని యోచిస్తోంది. క్రోమ్ ను విక్రయిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తోంది.

చాట్‌జీపీటీ, పెర్‌ప్లెక్సిటీ వంటి చాట్‌బాట్‌ల వైపు కొత్త తరాల వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. దీనితో వెబ్ బ్రౌజర్‌లు సెర్చింగ్ ట్రాఫిక్, యూజర్ డేటాకు కీలక గేట్‌వేగా తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోన్నాయి. ఇది బిగ్ టెక్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు మరింత ఊతమిచ్చినట్టవుతోంది.
పెర్‌ప్లెక్సిటీకి ఇప్పటికే 'కామెట్' అనే ఏఐ బ్రౌజర్ ఉంది. క్రోమ్‌ను కొనుగోలు చేయడం ద్వారా మూడు బిలియన్ల మంది వినియోగదారులను సొంతం చేసుకున్నట్టవుతుంది. తద్వారా ఓపెన్‌ఏఐ వంటి సంస్థలతో పోటీ పడగలదు. చాట్‌జీపీటీ కూడా తన సొంత ఏఐ బ్రౌజర్‌ను అభివృద్ధి చేస్తోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications