Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందరి కొంప కొల్లేరే

ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమలో 1,20,000కు పైగా ఉద్యోగాల తొలగింపునకు కేంద్రబిందువు అయింది.. 2025.జరిగింది. లక్షలాదిమంది ఉద్యోగులకు పీడకలగా మారిన సంవత్సరం ఇది. దాదాపుగా అన్ని దిగ్గజ టెక్ కంపెనీలన్నీ లేఆఫ్స్ బాట పట్టాయి. టీసీఎస్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, డెల్, యాక్సెంచర్, ఇంటెల్, మెటా.. ఇలా చిన్న, పెద్దా అనే తేడానే లేదీ విషయంలో. అన్ని సంస్థలూ ఉద్యోగాల్లో కోత పెట్టాయి. ఉద్యోగుల కొంపముంచాయి.

ఖర్చుల నియంత్రణ చర్యలు, పునర్వ్యవస్థీకరణ.. ప్రత్యేకించి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆప్టిమైజేషన్.. ఈ లేఆఫ్స్ కు కారణం అయ్యాయి. ఈ ఉద్యోగ కోతలు చిప్‌ మేకర్ల నుండి ఐటీ సంస్థల వరకూ పాకింది. క్లౌడ్, టెలికాం కంపెనీలనూ వదల్లేదు. దాదాపుగా అన్ని రంగాల్లోనూ విస్తరించాయి. మెటా వంటి దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కూడా కాస్ట్ కటింగ్ వెళ్లిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Tech Giants Cut Over 120000 Jobs in 2025 as AI becomes the Driving Force

ఈ ఉద్యోగ కోతల్లో ఇంటెల్ అగ్రస్థానంలో నిలిచింది. సెమీకండక్టర్ దిగ్గజం తమ ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి, ఫౌండ్రీ కేంద్రీకృత విధానాలను అనుసరించింది. ఈ క్రమంలో దాదాపు 24,000 ఉద్యోగాలను తగ్గించింది. దీని తర్వాత రెండో స్థానంలో నిలిచింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. 20,000 ఉద్యోగాల కోత పెట్టింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డెలివరీ మోడళ్లను అడాప్ట్ చేసుకున్నందున ఈ స్థాయిలో ఉద్యోగాలను తొలగించాల్సి వచ్చిందని TCS వెల్లడించింది.

వెరిజోన్ తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించింది. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా 15,000ని తొలగించింది. లేఆఫ్స్ లో ఈ సంస్థది మూడోస్థానం. ఆ తర్వాత అమెజాన్ 14,000 మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాల్లో కోత పెట్టింది. డెల్ టెక్నాలజీస్ తమ వ్యయ నిర్వహణను తగ్గించుకోవడం, AI- ఆప్టిమైజ్డ్ హార్డ్‌వేర్, ఎంటర్‌ప్రైజ్ సేవల వైపు మళ్లే క్రమంలో సుమారు 12,000 ఉద్యోగాలకు కోత పెట్టింది.

యాక్సెంచర్ కూడా జనరేటివ్ AI ప్రాజెక్టుల వైపు మళ్లింది. దాదాపు 11,000 మంది ఉద్యోగులను తగ్గించింది. SAP క్లౌడ్ కంప్యూటింగ్, బిజినెస్ ఏఐకి వనరులను తిరిగి కేటాయించడానికి 10,000 ఉద్యోగాలను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. వచ్చే సంవత్సరం దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్ గేమింగ్, అజ్యూర్‌తో సహా వివిధ విభాగాల్లో సుమారు 9,000 ఉద్యోగాలను తగ్గించింది. దీర్ఘకాలిక ఏఐ మౌలిక సదుపాయాల పెట్టుబడులకు ప్రాధాన్యతనిచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+