AI భర్తీ చేయలేని ఉద్యోగాలేవి ? ఎలాన్ మస్క్ అంచనా ఇదే..!

ప్రపంచవ్యాప్తంగా ఏఐ దూకుడుతో ఉద్యోగాలకు ముప్పు పెరిగిపోతోంది. చిన్న స్ధాయి సంస్ధల నుంచి భారీ కంపెనీల వరకూ ఏఐని వాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కూడా అదే స్ధాయిలో ముప్పు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ ప్రభావం లేని ఉద్యోగాలేవన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. దీనికి టెక్ నిపుణుల నుంచి కంపెనీల సీఈవోల వరకూ తమదైన రీతిలో సమాధానాలు ఇస్తున్నారు.

ఇదే క్రమంలో టెస్లా సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా దీనిపై స్పందించారు. తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో ఓ యూజర్ వేసిన ప్రశ్నకు మస్క్ స్పందిందారు. ఏఐ భర్తీ చేయలేని ఉద్యోగాలు ఏంటనే ప్రశ్నకు స్పందిస్తూ మస్క్.. అలా నిర్దిష్టంగా చెప్పలేమని, అయితే కథలు చెప్పడం, కళలు, సంరక్షణ, ఇతర మానవ సంబంధాలతో కూడిన ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయలేదన్నారు. అలాగే వినోదం, థెరపీ, విద్య, ఆతిధ్య రంగాలు కూడా సేఫ్ అన్నారు.

tesla ceo elon musk reveals jobs which AI cannot replace in future

మరోవైపు ఏఐ భవిష్యత్తులో తయారీ, కస్టమర్ సర్వీస్, డేటా ఎంట్రీ వంటి రంగాలను మాత్రం భర్తీ చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మానవ సంబంధాలతో కూడిన ఉద్యోగాలకు మాత్రం ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. వీటిని ఏఐతో పాటు భవిష్యత్తులో ఏ సాంకేతిక పరిజ్ఞానం కూడా భర్తీ చేయలేదన్న అంచనాలున్నాయి. ఇదే విషయాన్ని మస్క్ తో పాటు ప్రపంచంలో అగ్ర స్ధాయి కంపెనీల సీఈవోలు, నిపుణులు కూడా సమర్ధిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+