"భారత్ ది డెడ్ ఎకానమీ" కామెంట్స్- ట్రంప్ ను చాచి కొట్టిన సొంత ఏఐ సంస్థలు..!

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 25 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అదే సమయంలో మృత ఆర్ధిక వ్యవస్థల్ని కలిగిన ఈ రెండు దేశాలూ ఇంకా పతనం కావడం ఖాయమని తేల్చేశారు. దీనిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారత ఆర్దిక వ్యవస్థ ప్రపంచంలో ఎంతో గొప్పదని, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఎకానమీ అంటూ గణాంకాల ఆధారంగా మనం చెప్పుకుంటున్న తరుణంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారతీయులు మండిపడుతున్నారు.

మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు అక్షరాలా నిజమని, ఈ విషయం ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తప్ప అందరికీ తెలుసంటూ రాహుల్ గాంధీ కూడా వ్యాఖ్యానించారు. దీంతో భారత్ ది మృత ఆర్దిక వ్యవస్ద అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆషామాషీవి కాదని భావిస్తున్న ప్రపంచ దేశాలు ఇప్పుడు డేటా ఆధారంగా వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో అమెరికాకు చెందిన ఏఐ ప్లాట్ ఫామ్స్ ను కూడా అంతా ఇదే ప్రశ్న అడుగుతున్నాయట.

Trump s Dead Economy Taunt on India Raises Questions for American AI

దీనికి అమెరికా ఏఐ సంస్థలు ఛాట్ జీపీటీ, గ్రోక్, జెమినీ, మెటా ఏఐ, కోపైలట్ తమదైన శైలిలో సమాధానాలు ఇస్తున్నాయి. అయితే అన్ని సంస్థలూ ముక్తకంఠంతో ట్రంప్ వ్యాఖ్యలు అబద్ధమని తేల్చేశాయి. వీటిలో ఒక్కో ఏఐ ప్లాట్ ఫామ్ ఒక్కోలా ట్రంప్ కామెంట్ ను విశ్లేషించాయి. దీంతో ఇప్పుడు అమెరికాకు చెందిన ఏఐ సంస్థలే ట్రంప్ వాదనను తిరస్కరించడం అక్కడి ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు సైతం మింగుడు పడటం లేదు.

ట్రంప్ వ్యాఖ్యలపై ఛాట్ జీపీటీని అడిగితే "భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా చనిపోలేదు. ఇది డైనమిక్, ఇది ప్రతిష్టాత్మకమైనది" అంటూ సమాధానం ఇచ్చింది. గ్రోక్ ను అడిగితే "లేదు, భారత ఆర్థిక వ్యవస్థ చనిపోలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది." అంటూ తేల్చేసింది. జెమిని ఏఐని అడిగితే "భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి ద్వారా వర్గీకరించబడింది." అని స్పందించింది.

Trump s Dead Economy Taunt on India Raises Questions for American AI

మెటా ఏఐని అడిగితే "భారత ఆర్థిక వ్యవస్థ చనిపోలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి." అంటూ స్పష్టం చేసింది. అలాగే కోపైలట్ ను అడిగితే "ట్రంప్ వ్యాఖ్యలు వాస్తవానికి దగ్గరగా కూడా లేవని, నిజానికి ఇవి వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని నిర్మహమాటంగా చెప్పేసింది. దీంతో ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమని స్వదేశంలోని ఏఐ సంస్థలే తేల్చేసినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+