ఇండస్ట్రీ భారమంతా బాలయ్యపైనే.. అఖండతో తాండవం చేస్తాడా..?

భారీ హిట్లు.. రికార్డులు బద్దలవడం అనే మాటలు సినీ పరిశ్రమలో విని చాలా రోజులైంది. 2025 సంవత్సరం ముగుస్తుండడంతో ఈ ఏడాదికి భారీ ముగింపు పలికే బాధ్యత బాలకృష్ణపై పడింది. దసరా, దీపావళి సమయంలో ఆశించిన స్థాయిలో సినిమాలు నడవలేదు. అక్టోబర్, నవంబర్ నెలలో సినిమాలు వచ్చినా సినీ పరిశ్రమ ఆకలిని తీర్చలేదు.

బాలయ్య పైనే భారం

గత నెలలో విడుదలైన రవితేజ మాస్ జాతర అంతగా నడవలేదు. రష్మిక మందన్నా ది గర్ల్ ఫ్రెండ్ తో సినీ ప్రేక్షకులకు కొంత ఆకట్టుకోగా.. రాజు వెడ్స్ రాంబాయి మౌత్ టాక్ తో దూసుకెళ్తోంది. ఏడాది ముగుస్తుండడంతో మాంచి హిట్ ను ఇండస్ట్రీ కోరుతోంది. ఆ పని ఇప్పుడు ఒక్క బాలయ్యే చేయాల్సి ఉంది. హిట్ కాంబినేషన్ బోయపాటి- బాలకృష్ణ అఖండ-2 తాండవం వస్తోంది. ఈ శుక్రవారం విడుదలవుతున్న అఖండ తాండవంపైనే సినీ పరిశ్రమ భారీ ఆశలు పెట్టుకుంది.

akhanda-2-can-balakrishna-deliver-the-big-hit-tollywood-pins-hopes-on-boyapatis-mass-actioner

అఖండ తొలి భాగం సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ నటుడిగా తన విశ్వరూపం చూపడంతో అతడి అభిమానులతోపాటు ప్రేక్షకులు పండుగ చేసుకున్నారు. అనేక రికార్డులు బద్దలు కొట్టగా రెండో భాగంపై ఆ రికార్డులను తిరగరాస్తుందని చిత్రబృందం పూర్తి విశ్వాసంతో ఉంది. సనాతన ధర్మం అంశంపై తెరకెక్కుతున్న అఖండ తాండవం టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అఖండ తర్వాత తెలుగులో అంతటి భారీ సినిమా సంక్రాంతి వరకు లేదు.

మిగతా సినిమాలు
అఖండ తర్వాత మరికొన్ని సినిమాలు ఉన్నాయి. యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల మోగ్లీగా వస్తున్నాడు. జాతీయ అవార్డు పొందిన దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆడితే ఇండస్ట్రీకి ఆదాయం.. రోషన్ నటుడిగా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఒక్క హిట్ పొందని రోషన్ మోగ్లీపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

చాన్నాళ్ల తర్వాత ఆది సాయికుమార్ థియేటర్ లోకి వస్తున్నాడు. యుగంధర్ ముని దర్శకత్వంలో శంభాలతో డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఛాంపియన్ సినిమాతో క్రిస్మస్ కు వస్తుండగా.. మరో చిన్న సినిమా దండోరా అదే రోజు విడుదల కానుంది.

అదరగొట్టనున్న అవతార్
హాలీవుడ్ విజువల్ వండర్ అవతార్ మూడో భాగం రానుంది. పంచభూతాల్లో ఒకటైన అగ్ని నేపథ్యంలో అవతార్ ఫైర్ అండ్ యాష్-3 డిసెంబర్ 19వ తేదీన విడుదల కానుంది. పండోర అనే కల్పిత గ్రహం నేపథ్యంలో అగ్నికి సంబంధించిన ఇతివ్రుత్తంతో జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన వెండితెర అద్భుతం తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. అవతార్ 1, 2 తెలుగులో కూడా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అఖండతోపాటు అవతార్ సినిమాలు 2025కు ఘనమైన ముగింపు పలికే అవకాశాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+