"కింగ్" కొడుకు సార్.. మరో బెస్ట్ యాక్టర్ అవార్డు కైవసం..
ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (ఐఎన్‌సీఏ) అవార్డుల (inca awards 2026) వేడుక అట్టహాసంగా నిర్వహించారు. ముంబై వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యాక్టర్ రానా, నటి శ్రియ, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. చిత్ర పరిశ్రమలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొస్తూ.. నిర్వహించిన ఈ ఈవెంట్‌లో చాలామంది సినీ ప్రముఖులు సందడి చేశారు. ఈ అవార్డు వేడుకలో దేశవ్యాప్తంగా పన్నెండు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. కాగా టాలీవుడ్ నుంచి ఉత్తమ నటుడిగా నాగచైతన్య (Naga Chaitanya) 'తండేల్' సినిమాకు గాను అవార్డు దక్కించుకున్నారు.
కాగా అక్కినేని ఫ్యామిలికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు టాలీవుడ్ కి ఒక మూల స్తంభం లాగా నిలిచి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకోగలిగారు. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున సైతం స్టార్ హీరోగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇప్పుడు అదే బాటలో నాగ్ కుమారుడు నాగ చైతన్య సైతం దూసుకుపోతున్నారు. నటుడిగా తన ప్రతిభను మరింతగా నిరూపించుకుంటూ, పరిశ్రమలో తన స్థాయిని బలంగా నిలబెట్టుకుంటున్నారు. ఇక ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ పురస్కారాలలో ఉత్తమ నటుడిగా ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అలానే మరో ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకొని వార్తల్లో నిలిచారు.

ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ.. ప్రతి సినిమా, ప్రతి పాత్ర నుండి ఏదో ఒకటి నేర్చుకుంటామని.. తండెల్ తనకు మరపురాని సినిమా అని కొనియాడారు. తండెల్ రాజు పాత్ర తనకు చాలా విషయాలు నేర్పిందని తెలిపారు. మత్స్యకారుల జీవితాన్ని తెరపైకి తీసుకురావడం మరపురాని ప్రయాణమని అన్నారు. తన విజయంలో కీలక పాత్ర పోషించిన చిత్ర బృందానికి కృతజ్ఞతలు చెప్పారు. వారి అందరి సహకారం లేకుండా తాను ఈ రోజు ఇక్కడ నిలబడలేనని పేర్కొన్నారు.
అలానే 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అనిల్ రావిపూడి, ఉత్తమ హాస్యనటుడిగా మాస్టర్ రేవంత్ అవార్డులు అందుకున్నారు. నటులుగా భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికి గానూ కమల్‌హాసన్, రేఖను ప్రత్యేక అవార్డులు వరించాయి. కమల్‌హాసన్‌కు నిర్మాత అల్లు అరవింద్, రేఖకు కమల్‌హాసన్ పురస్కారాలను అందజేశారు. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.
తమిళం (Tamil)..
తమిళ సినీ పరిశ్రమ నుంచి దుల్కర్ సల్మాన్ ఉత్తమ నటుడిగా ('కాంత' చిత్రం), సిమ్రాన్ ఉత్తమ నటిగా ('టూరిస్ట్ ఫ్యామిలీ') ఎంపికయ్యారు. మారి సెల్వరాజ్ ఉత్తమ దర్శకుడిగా నిలవగా, 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది.
కన్నడ (Kannada)..
కన్నడ పరిశ్రమలో 'కాంతార చాప్టర్ 1' చిత్రం ఆధిపత్యం చాటింది. ఈ చిత్రానికి గానూ రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. రుక్మిణి వసంత్ ఉత్తమ నటిగా నిలిచారు. అలాగే 'కాంతార' ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకుంది.
A performance that carried both intensity and vulnerability, bringing depth to every moment on screen.@iamnagarjuna wins Best Actor (Telugu) at INCA Awards 2026 for Thandel, delivering a portrayal that stayed long after the story unfolded.
— Indian National Cine Academy (@inca_original) April 16, 2026
A performance that truly lingered.… pic.twitter.com/krNmRpvN4w
మలయాళం (Malayalam)..
మలయాళ సినీ పరిశ్రమలో నివిన్ పౌలీ ('సర్వమ్ మాయ') ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా, కళ్యాణి ప్రియదర్శన్ ఉత్తమ నటిగా నిలిచింది. 'లోకా చాప్టర్ 1' ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకోగా, డొమినిక్ అరుణ్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు.
హిందీ (Hindi)..
హిందీ సినీ పరిశ్రమలో రణవీర్ సింగ్ ('ధురంధర్') ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. యామీ గౌతమ్ ధర్ ('హక్' చిత్రం) ఉత్తమ నటిగా నిలిచింది. 'ఛావా' ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకోగా, 'ధురంధర్' సినిమాకు ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు.












Click it and Unblock the Notifications